Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కన్నాయిగూడెం
వర్షాకాలంలో ఎగువప్రాంతాల్లో నుండి ప్రాజెక్టుల ద్వార వరదలు వచ్చే ప్రమాదం ఉందని తహశీల్దార్ దేవసింగ్ అన్నారు.మండలంలో మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ శమావేశం లో ఎంపీడీఓ అడ్డురి బాబు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామపంచాయతీలలో మొక్కలు నాటాలని అన్నారు.అలాగే కంతనపల్లి గ్రామం నుండి తుపాకులగూడెం వరకు గల ప్రధాన రహదారిపై ఇరువైపులా మొక్కల నాటాలని అన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మెడికల్ ఆఫీసర్ అల్లి నవీన్ మాట్లాడుతూ మండలంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకుండా కనీసం మాస్కలు లేకుకండా పెళ్లిళ్లు, పంక్షన్లకు వెళ్లవద్దని, ప్రజలకు చూచించారు. స్థానిక తహశీల్దార్ దేవసింగ్ మాట్లాడుతూ మండలంలో కంతనపల్లి, చింతగూడెం, బుట్టయిగూడెం, కొత్తూరు, గుర్రెవుల, వెంకట్రావుపల్లి, గ్రామాల్లో ముంపు ప్రమాదం ఉందని అన్నారు. ఈ గ్రామాల్లో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు మండలంలో హరితహారంలో భాగంగా మండలంలో అధికారులు ప్రజాప్రతినిధులు, మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఈజీఎస్ ఏపీఓ చరణ్‌రాజ్, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.