Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే శంకర్‌నాయక్, చైర్మెన్ రవీందర్రావు
- బ్యాంక్ భవన నిర్మాణ పనుల పరిశీలన
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
త్వరలో రైతులకు డీసీసీ బ్యాంకు అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే శంకర్‌నాయక్, చైర్మెన్ మార్నేని రవీందర్రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంగారావు తెలిపారు. మండల కేంద్రంలో చేపట్టిన బ్యాంకు భవన నిర్మాణ పనులను శుక్రవారం వారు పరిశీలించి మాట్లా డారు. రైతుల సంక్షేమం కోసం బ్యాంకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలి పారు. బ్యాంకు ద్వారా మండల రైతులకు మరిన్ని సేవలు అందనున్నా యని చెప్పారు. కార్యక్రమంలో బ్యాంకు నోడల్ ఆఫీసర్ కష్ణమోహన్, మేనేజర్ హర్షిత, వివిధ బ్రాంచ్‌ల చైర్మెన్లు ధీకొండ వెంకన్న, రంజిత్, కేసముద్రం ధన్నసరి బ్యాంక్ సీఈఓ గోపాల మల్లారెడ్డి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
కేసముద్రం : పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 33 మంది లబ్దిదారులకు శుక్రవారం ఆయన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనూ లేకున్నా తెలంగాణలో పేద కుటుంబాల్లోని మహిళల వివాహానికి ప్రభుత్వం లక్ష నూటా పదహారు రూపాయల సాయం అందిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నజీర్, సర్పంచ్ యనమల ప్రభాకర్, ఎంపీటీసీ సట్ల వెంకన్న, నాయకులు మోడెంమ్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.