Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
- వ్యకాస జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్య, ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా బలోపేతం చేయాలని వ్యకాస జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం సందర్శించి రోగులను పరామర్శించింది. అనంతరం వీరయ్య మాట్లాడారు. జిల్లాలో 21 పీహెచ్‌సీలతోపాటు ఒకటి చొప్పున సీహెచ్‌సీ, యూహెచ్‌సీ ఉన్నట్టు తెలిపారు. జిల్లాలోని 7.70 లక్షల జనాభాకు అనుగుణంగా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది లేరని చెప్పారు. జిల్లాలో 26 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి 15 మంది వైద్యులను నియమించాల్సిన అవసరం ఉందని, 11 నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని ఊదరగొడుతున్నా ఆ దిశగా చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో సంఘం మండల నాయకులు ఇలకట్ల లాలయ్య, చీపురు గణేష్, పరిపూర్ణ చారి, అనిల్, సంపత్, మారగాని రమణయ్య, యాకూబ్అలీ, తదితరులు పాల్గొన్నారు.