Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు
- మండలంలో ఫ్రైడే-డ్రైడే
నవతెలంగాణ-బయ్యారం
ప్రతిఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మహబూబాబాద్ జెడీప చైర్పర్సన్ అంగోతు బిందు నాయక్ కోరారు. మండలంలోని లక్ష్మీనర్సింహపురం గ్రామంలో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బిందు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. నీరు నిల్వకుండా చూడాలని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తదితర సూచనలు అందించారు. ప్రతి ఇంట్లోనూ ఇంకుడు గుంతలు తవ్వితే మురుగునీరు నిల్వ ఉండదని చెప్పారు. మురుగు కాల్వల్లో నీరు నిల్వకుండా చూడాలని, ఇండ్ల నుంచి నీరు బయటకు పారకుండా చూడాలని చూడాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదనంతరం గ్రామంలోని రోడ్డు వెంట, వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో, గురిమిళ్ల, గౌరారం, వినోద్‌నగర్ గ్రామాల్లో ఇంటింటికీ దోమతెరలు పంపిణి చేసి మాట్లాడారు. రేషన్ బియ్యం ఇవ్వడం గ్రామస్థులు లేదని తెలుపగా తహసీల్దార్‌తో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్ మూల మధుకర్‌రెడ్డి, సర్పంచ్ భూక్యా పద్మ, ఉపసర్పంచ్ మూల ఉషారాణి, ఎంపీడీఓ చలపతిరావు, ఎంపీఓ పద్మ, మెడికల్ ఆఫీసర్ రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి సంగీత, తదితరులు పాల్గొన్నారు.