Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ గుండె బాబు
నవతెలంగాణ-తొర్రూరు
భవన నిర్మానాల్లో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ గుండె బాబు స్పష్టం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించగా కమిషనర్ మాట్లాడారు. లేఅవుట్ పర్మిషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేపట్టొద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చి వేస్తామని చెప్పారు. 30 ఫీట్ల రోడ్డు వెడల్పునకు లోబడి నిర్మాణాలు చేపట్టొద్దని తెలిపారు. 75 గజాల లోపున్న స్థలాల్లో నిర్మాణాలు చేపడితే ముందూ, వెనకా 5 గజాలు వదిలి నిర్మించాలని చెప్పారు. అలాగే 76 గజాలకు మించిన స్థలంలో నిర్మాణాలు చేపడితే టీఎస్ బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసి అనుమతి పొందిన అనంతరమే నిర్మించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నాలాల మీద అక్రమ కట్టడాలు నిర్మిస్తే కూల్చివేస్తాని తెలిపారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవన్నారు. ఆర్ అండ్ బీ రోడ్డుకు 60 ఫీట్ల పరిధి దాటి వ్యాపార సముదాయాల అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, వ్యాపార సామాగ్రి, నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని తెలిపారు. సమావేశంలో టీపీఎస్ ఖురేషీ, ఆర్ అండ్ బీ ఏఈ సందీప్, ఆర్ఐ రాకేష్, ఫైర్ అధికారులు రాజేందర్, మహేందర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో ఫ్రైడే-డ్రైడే
మున్సిపల్ కార్యాలయంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపులో నిల్వ ఉన్న నీటిని మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు తొలగించారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రతిఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కాల్వల్లో దోమలు ప్రబలకుండా మలతిన్ స్ప్రే చేస్తున్నట్టు తెలిపారు. అలాగే నిల్వ ఉన్న నీటి గుంతలో త్వరలో గుంబూషియా చేపలు వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ సురేందర్‌రెడ్డి, మేనేజర్ శ్రీనివాసస్వామి, నాయకులు జైసింగ్, శానిటరీ ఇన్స్పెక్టర్ కొమ్ము దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.