Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.1.61 కోట్ల ప్యాకెట్లు స్వాధీనం
- పోలీసు కమిషనర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల నియంత్రణ కోసం 63011 76533 సెల్ నెంబర్కు ఫిర్యాదు చేయాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఒక ప్రకటనలో కోరారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 6 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇందులో నర్సంపేట పోలీసు స్టేషన్ పరిధిలో 2 కేసులు, పరకాల, చెన్నారావుపేట, జనగామ, ఇంతేజార్గంజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసు చొప్పున నమోదు చేసినట్లు చెప్పారు. ఈ దాడుల్లో మొత్తం రూ.1.61 కోట్ల విలువ గల 13 వేల నకిలీ విత్తనాల ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పోలీసు కమిషనర్ తెలిపారు. తొలకరి వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలో వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని, రాష్ట్రంలో నకిలీ విత్తనాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు, అనుమతి లేని విత్తనాల కట్టడి కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు స్థానిక వ్యవసాయాధికారులతో కలిసి అనుమానిత ప్రాంతాల్లో దాడులు చేపట్టడంతోపాటు విత్తన విక్రయ కేంద్రాలపై తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల నియంత్రణ కోం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.