Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ- భూపాలపల్లి
ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లను అందించడం అభినందనీ యమని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య అన్నారు. జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసిన సేవ్ ద చిల్డ్రన్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాలకు 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య మాట్లాడుతూ వెనుకబడిన జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాల కరోణ వైద్య సేవలకు ఊతం అందించేందుకు సేవ్ ద చిల్డ్రన్ ఇంటర్నేషనల్ ఎన్జీవో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లను అందించడం సంతోషదాయకమని, ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను జిల్లా ఆస్పత్రి, చిట్యాల, మహాదేవపూర్ సిహెచ్సీలతో పాటు ములుగు, ఏటూర్ నాగారం ఆసుపత్రులలో వైద్య సేవలకు ఉపయోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, డిపిఆర్వో రవికుమార్, సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ తెలంగాణ రాష్ట్ర సీనియర్ మేనేజర్ ప్రశాంతి, అసిస్టెంట్ మేనేజర్ నితిన్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.