Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూరల్ జిల్లా కిసాన్ కాంగ్రేస్ అధ్యక్షుడు
- బొంపెల్లి దేవేందర్ రావు డిమాండ్
నవతెలంగాణ-పర్వతగిరి
ప్రభుత్వం అర్బన్ జిల్లా కార్యాలయం ప్రారంభం కంటే ముందే రూరల్ జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలని వరంగల్ రూరల్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూరల్ జిల్లాలో ఉన్న 16 మండలాలకు అనుకూలమైన జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలని కోరారు. అర్బన్ జిల్లా, రూరల్ జిల్లా ప్రకటించినప్పటి నుండి రూరల్ జిల్లా పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండు జిల్లాలను ప్రకటించిన ముఖ్యమంత్రి, ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం పూర్తి చేయడం, మరొక జిల్లా కేంద్రాన్ని కూడ ప్రకటించకుండా ఆలస్యం చేయడం పరిపాలన అలసత్వానికి నిదర్శనమని ఆరోపించారు. రూరల్ జిల్లాలో ముగ్గురు శాసనసభ్యులు, ఒక మంత్రి ఉన్నాకూడ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యా లయ ప్రారంభోత్సవానికి ఉత్సాహంగా పని చేస్తున్నారని,అదే రూరల్ జిల్లా కేంద్రాన్ని మరిచిపోవడం సిగ్గుచేట న్నారు. అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవం కంటే ముందే, వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాన్ని ప్రకటించుటకు శాసనసభ్యులు, మంత్రివర్యులు చర్య తీసుకోవాలని కోరారు. జిల్లా కేంద్రాన్ని ప్రకటించకుండా, మరొక జిల్లా కేంద్రంలో పాత భవనాల నుండి పరిపాలన వలన, ప్రజల మనో భావాలు దెబ్బతిన్నాయని, ఇప్పటికైనా వెంటనే రూరల్ జిల్లా కేంద్రాన్ని ప్రకటించానలి, లేనిచో ప్రజాప్రతినిధులకు మండలాలలో తిరుగకుండా ప్రజలు అడ్డుకోవడం ఖాయమని హెచ్చరించారు.