Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ-ఎల్కతుర్తి
పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా ఆదుకుంటున్నడని ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్దిదారులకు మంజూరైన షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల భవిష్యత్తు కోసం సీఎం కేసీఆర్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు, వివాహం కోసం ఒక లక్ష 116 రూపాయలు పెళ్లి కట్నంగా ఇస్తున్నాడని కొనియాడారు. రైతుల కోసం ఉచిత 24 గంటల కరెంటుతో పాటు ఎకరాకు రూ. 10 వేల రైతుబంధు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 5 లక్షల రైతుభీమా అందిస్తున్నారన్నారు. నూతనంగా పీవీ జిల్లా ఏర్పాటు అయినప్పటికీ ఎల్కతుర్తి మండలం వరంగల్ అర్బన్ లోనే ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్‌కుమార్, తహశీల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డి, ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ నగేష్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పోరెడ్డి రవీందర్‌రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ శేషగిరి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రామారావు, రైల్వే బోర్డు మెంబర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు వేసుకోవాలి
ఆరుతడి పంటలు వేసుకోవాలని ఎమ్మెల్యే. ఓడితల సతీష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండల వ్యవసాయశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతులందరూ వరి ధాన్యం వైపే మొగ్గు చూపకుండా మెట్ట ప్రాంత రైతులు ఆరుతడి పంటలు పెసర, కంది, పప్పు దినుసులు, ఆయిల్ఫామ్, ధాన్యాలు పండించే విధంగా గా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ఆరుతడి పంటలు వేయడం వల్ల భూసారం పెరిగి రైతులకు లబ్ధి చేకూరుతుందని అర్బన్ జిల్లా ఏడీఏ దామోదర్‌రెడ్డి అన్నారు.
ఎల్కతుర్తి మండలాన్ని హుజురాబాద్ జిల్లాలో కలపకూడదు
హుజురాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయబోతున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో హుజరాబాద్ జిల్లాలో ఎల్కతుర్తి మండలం విలీనం చేయకుండ వరంగల్ అర్బన్ జిల్లాలో కొనసాగించి, రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో ఎల్కతుర్తి మండలం వరంగల్ అర్బన్ జిల్లాలోని ఉంటుందని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో బోమనపల్లి అశోక్ రెడ్డి, దాట్ల నరేష్, అంబాల కార్తిక్, సాహు , నాగరాజు, ప్రేమ్, సంజీవ్, రాజ్ కుమార్, ప్రకాష్, సన్నీ పాల్గొన్నారు.