Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు రాజ్‌కుమార్,బందు సాయిలు
- నేడు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-భూపాలపల్లి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ , నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ , సీపీఎం జిల్లా కార్యదర్శులు కొరిమి రాజ్ కుమార్ , బంధు సాయిలు డిమాండ్ చేశారు . శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భారతదేశవ్యాప్తంగా పెట్రోల్, డీజల్,గ్యాస్,నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఉమ్మడి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచమార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినకానీ ప్రభుత్వం మాత్రం ధరలు విచ్చలవిడిగా పెంచుతుందన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రయివేటు హాస్పిటల్ అధిక పీజులు వసూలు చేస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకకొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. రేషన్‌కార్డ్ ఉన్న ప్రతి ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని, 10 కేజీల సన్న బియ్యం ఇవ్వాలన్నారు. పెట్రోల్,డీజల్,గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నేడు జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు , ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు . ఈ సమావేశంలో నాయకులు, మోటపలుకుల రమేష్,బొట్ల చక్రపాణి, కుడుదుల వెంకటేష్, సోత్కు ప్రవీణ్,వెలిశెట్టి రాజయ్య, అమతయ్య తదితరులు పాల్గొన్నారు.