Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-నర్సంపేట
ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్న వైద్యులపై దాడులకు పాల్పడడం అమానుషమని నర్సంపేట ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ద్వారకపేట రోడ్డులో ఐఎంఏ ఆధ్వర్యంలో జాతీయ నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా విలయతాండవం చేస్తుండగా వైద్యులు ఎంతో మందికి వైద్యం అందించి బ్రతికిస్తున్నారని తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా మారి మృతి చెందితే వైద్యులను బాధ్యులను చేసి దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు చెందిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సైన్యంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటున్న ప్రభుత్వం వైద్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం అన్యాయమన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీ. గోపాల్, ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ పీ. జాన్సన్, డాక్టర్ తిరుపతి, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ రామచంద్రు, డాక్టర్ రమేష్, డాక్టర్ ఉజ్వల పాల్గొన్నారు.
వైద్యులను ప్రజలే రక్షించుకోవాలి : సంరక్ష చైర్మన్ డా. సమ్యేల్
కాశిబుగ్గ:వైద్యులను, వైద్య సిబ్బందిని ప్రజలే రక్షించుకోవాలని సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఎన్ సామ్యుల్ అన్నారు. వైద్యులపై వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ మరియు జిల్లా 149 కమిటీ లు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం వరంగల్ లోని సంరక్ష హాస్పిటల్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సంరక్ష చైర్మన్ డాక్టర్ ఎన్. సమ్యేల్ మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ ప్రాణాలను, కుటుంబాన్ని లెక్కచేయకుండా వైద్యం అందిస్తూ ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. వైద్యులపై దాడులు పునరావతం కాకుండా కఠినమైన చట్టాలు తేవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈనిరసన కార్యక్రమంలో డాక్టర్లు పోలా నటరాజ్, భాస్కర్, మోహన్ దాస్, దీపక్, శ్రీకాంత్ రెడ్డి, విశ్వజిత్, పూర్ణచందర్, సందీప్, గాయత్రి, మనో, శివ కృష్ణ పాల్గొన్నారు.
మట్టెవాడ : వైద్యులపై, ఆసు పత్రులపై దాడికి పాల్పడిన వారిపై ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి కఠినం గా శిక్షించాలని వరంగల్ జిల్లా ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్ పెదమల్లు సుధీర్ కుమార్ డిమాండ్ చేశారు. ఐఎంఎ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయం ముందు వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి డాక్టర్లు రోగులకు వైద్యం అందిస్తున్న వైద్యులపై దాడులు జరగడం విచారకరమని, ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. క అనంతరం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాష్ కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రెటరీ డాక్టర్ బి.ప్రభాకర్, కోశాధికారి డాక్టర్ రాజామోహన్, డాక్టర్ కస్తూరి ప్రమీల, డాక్టర్ పెసరు విజరు చందర్ రెడ్డి, డాక్టర్ అశోక్ రెడ్డి, డాక్టర్ ఎం.సుదీప్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.