Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి
- తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ - ఖిలా వరంగల్
ఖిలావరంగల్ మండలం బొల్లి కుంట శివారు సర్వే నెంబర్ 476, 484, 506లలోని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ మంజులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిగులు నిధులతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ప్రభుత్వ భూములు అమ్మితే గాని నడపలేని దుస్థితికి వచ్చిందని విమర్శించారు. దళితులకు పంచడానికి మూడెకరాల భూమి లేదన్న కేసీఆర్ ఇప్పుడు అమ్మడానికి ఎక్కడ నుంచి భూమి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ భూములు ఎవరు కొనవద్దని, ఒకవేళ కొనుగోలు చేసిన అట్టి భూములలో ఎర్ర జెండా లు పాతి పేద ప్రజలకు పంచుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి షేక్ భాషిమియా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తోట బిక్షపతి, నగర సహాయ కార్యదర్శి గన్నవరపు రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సంగి ఏలే0దర్, నగర కార్యవర్గ సభ్యులు గుండె బద్రి ఎండి హుస్సేన్ పాల్గొన్నారు.