Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదనిబీజేపీ మండల అధ్యక్షులు మురావత్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. మండల కేంద్రం వేలేరులో కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శి కాట్రేవుల రాజుతో కలిసి టీఆర్ఎస్ నాయకుల తప్పుడు ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా మురావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ అక్రమ మొరం రవాణా దందా విషయంలో గత నెల 15 రోజులుగా జరుగుతున్న సంఘటనలను వివరిస్తూ అక్రమ మొరం రవాణా దందాకు పాల్పడిన వారిలో లోక్యా తండా ప్రజాప్రతినిధుల పాత్ర ఉండడం వల్లే షోడశపల్లి గ్రామ రైతులపై, మీడియా పై దాడి జరిగిన సంఘటన తమ దృష్టికి రావటం వల్ల మాత్రమే ఖండిం చామని ఎక్కడ కూడ బిజేపి నాయ కులు ఇట్టి మొరం రవాణా దందాలో పల్లా , స్థానిక జెడ్పీ టీసి చాడ సరిత పాత్ర ఉన్నట్లు ఆరోపించలేదని అనవసరంగా బిజేపి పై టీఆర్ఎస్ మండల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపి పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.