Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యాటకుల షికారుకు రెండు బోట్లు..
- ఆహ్లాదం నింపేందుకు అభివృద్ధి పనుల ప్రతిపాదనలు
నవతెలంగాణ-నర్సంపేట
చారిత్రక మాధన్నపేట పెద్ద చెరువుకు మహర్థశ రాబోతుంది. పర్యాటకులను కనుల విందు చేసేలా ఆహ్లా దాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా చేయడానికి గ్రీన్ సిగల్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్ర పర్యాటక శాఖ ఎట్టకేలకు మాధన్నపేట పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి 2016 నుంచి చేస్తున్న కృషికి అడుగులు పడుతున్నాయి. మీనీ ట్యాంక్ బండ్‌గా తీర్చిద్ద డానికి రూ.7.51 కోట్లను మంజూరు చేయించారు. నాటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావుతో అతి పెద్ద మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరింపజేయడం ప్రత్యేకతను సంత రించుకుంది. మిషన్ కాకతీయ కింద చెరువు పునరుద్ధరణ నిర్మాణ పనులు చేపట్టారు. మినీ ట్యాంకు బండ్ పనులు కొంత అసంపూర్ణంగా నిలిచాయి. చారిత్రక నేపధ్యం సంత రించుకున్న పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా గుర్తిం చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి పర్యాటక శాఖ మంత్రి అజ్మీర చందులాల్, పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు సందర్శించారు. పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరగా వారు సానుకూలత వ్యక్తం చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ వాకటి కరుణ, ఆ తర్వాత వచ్చిన ప్రశాంత్ జీవన్ పాటిల్, నేటి కలెక్టర్ ఎం హరత పెద్ద చెరువు ప్రాంతం పర్యాటక కేంద్రానికి అనువైనదని తమ నివేదికల్లో ప్రభుత్వానికి పేర్కొన్నారు. ఇటీివల పెద్ద చెరువును నర్సంపేట పట్టణ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పటికే చెరువు కట్ట కింది భాగంలో పార్క్ ఏర్పాటుకు భూసేకరణ చేయడానికి సమ్మ తించేలా ఎమ్మెల్యే పెద్ది రైతులను ఒప్పించారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అన్నీ సానుకూల ప్రదేశంగా గుర్తింపుకు ఆమోద ముద్ర పడింది. ఇటివల పర్యాటక సంస్థ 30 సీట్ల సామార్ధ్యం కలిగిన పెద్ద బోటు, మరో జెట్ బోటును చెరువు వద్దకు తీసుకొచ్చి దింపారు. ఈ బోట్లు తుది మెరుగులు దిద్దాకా పర్యాటకుల షికారుకు అనుమ తినిస్తామని పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ తెలిపారు. కాగా ఇంతకు ముందు మిషన్ కాకతీయ పనులు చేపడుతున్న సమయంలో పర్యాటక శాఖ ట్రాయల్ రన్ కోసం తీసుకొచ్చిన 16 సీట్ల సామార్థ్యం కలిగిన జెట్ బోటును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసింది విధితమే. నియోజవర్గంలోని పర్యాటక కేంద్రంగా పాకాల సరస్సు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిం చుకొంది. పర్యాటకులను కనుల విందు చేస్తుంది. ఆ తర్వాత మాధన్నపేట పెద్ద చెరువును పర్యాటక జాబితాలోకి తీసుకొచ్చి అభివృద్ధి చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మినీ ట్యాంకు బండ్‌గా రూపాంతరం చెందుతుందనే ఆశాభావం వ్యక్తమౌతోంది.
పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించడం గర్వకారణం
పెద్ద చెరువును రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా గుర్తించడం గర్వకారణం. చారిత్రక నేపధ్యం కలిగిన పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా చేయాలనే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంకల్ఫం ఫలించడం హర్షనీయం.నర్సంపేట పట్టణం, చుట్టూర ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాలి. తొందర్లోనే బోటు షికారు అందుబాట్లోకి రాబోతుండడం సంతోషంగా ఉంది. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు పట్టణ ప్రజల పక్షాణ మున్సిపల్ పాలకవర్గం తరుపున కృతజ్ఞలు తెలియజేస్తున్నాం.
- గుంటి రజినీ కిషన్, మున్సిపల్ చైర్పర్సన్