Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. పట్టణంలోని అండర్ బ్రిడ్జ్ రీడిజైనింగ్ గాంధీ పార్క్ అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ప్రజలు, వ్యాపారస్తులు అభివద్ధికి సహకరించాలని కోరారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం గాంధీ పార్కులోని తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందించారు. ఎమ్మెల్యే వెంట మహబూబాబాద్ మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, సీనియర్ నాయకులు మార్నేని వెంకన్న, చీకటి వెంకన్న, మున్సిపల్ అధికారులున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో 22 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, నాయిని రంజిత్, గోగుల రాజు, చిట్యాల జనార్ధన్, బాలు, యాస వెంకట్‌రెడ్డి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.