Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీ నటుడు కిన్నెర యాదగిరి
- కోవిడ్ బాధితులకు, పేదలకు సరుకులు పంపిణీ
నవతెలంగాణ-తొర్రూరు
కరోనా కష్టకాలంలో సమాజంలోని ప్రతిఒక్కరూ సేవా దక్పథాన్ని అలవర్చుకోవాలని సినీ నటుడు కిన్నెర యాదగిరి ఆకాంక్షించారు. డివిజన్ కేంద్రంలోని సాయినగర్‌లో వీఆర్కేఎస్ఎస్ హెల్త్ ప్లస్ సంస్థ సౌజన్యంతో ఆయన ఆధ్వర్యంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, ఆలిండియా బేడ బుడగ జంగాల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎన్ఆర్ వెంకటేశం ఆదివారం కోవిడ్ బాధితులకు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడారు. కరోనా మహమ్మారి బారిన పడి అనేక మంది ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు కోలుకోలేని దుస్థితికి చేరుకున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టినప్పటికీ అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ఉదారంగా స్పందించి ఆదుకోవాలని కోరారు. కరోనా బాధితులకు, పేదలకు సరుకులు పంపిణీ చేయడం ద్వారా వీఆర్కేఎస్ఎస్ దాతత్వం చాటడం హర్షణీయమని చెప్పారు. కార్యక్రమంలో ఆలిండియా బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళ్యాణం శరత్చంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ సహదేవుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి వారణాసి, శివవర్మ, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తూర్పాటి వెంకటేష్, కోశాధికారి గగనం మన్నెం, యూత్ నాయకులు తూర్పాటి మెండిస్, సారయ్య, వెంకటేశ్వర్లు, నర్కుటి గోపాల్, వెంకటేష్, బాలనర్సింహ, రాములు, తదితరులు పాల్గొన్నారు.