Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు జిల్లా ఇన్‌ఛార్జి రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి
- పార్టీ మండల అడహక్ కమిటీ ఎన్నిక
- కన్వీనర్‌గా బాగె నర్సింహులు
నవతెలంగాణ-తాడ్వాయి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైఎస్సార్టీపీకి శ్రీరామరక్ష అని ఆ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని కాటాపూర్‌లో ఆ పార్టీ జిల్లా, మండల ముఖ్య కార్య కర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలు ఇబ్బందుల పాలౌతున్నారని తెలిపారు. ప్రజా, కార్మిక, రైతాంగ సమస్యల పరిష్కా రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పేద లకు, బడుగులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. అమరుల ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని మండిపడ్డారు. వందలాది మంది యువకులు ప్రాణత్యాగం చేసి స్వరాష్ట్రాన్ని సాధిస్తే రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందుతోందని ఆందోళన వెలిబుచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక, రైతాంగ, అన్ని తరగతుల ప్రజల సమస్యల పరిష్కా రం కోసం కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అనంతరం వైఎస్సార్టీపీ మండల అడహక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దామరవాయి గ్రామానికి చెందిన బాగే నర్సింహులును వైఎస్సార్టీపీ మండల అడహాక్ కమిటీ కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడారు. తనపై నమ్మకంతో కన్వీనర్‌గా ఎనుకున్నందుకు జిల్లా ఇన్‌ఛార్జీకి కృతజ్జతలు తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంది సేవలు అందిస్తానని చెప్పారు. తదనంతరం వలస శ్రీనివాస్, వట్టం శోభన్‌బాబు, రామిండ్ల లాలయ్య, రెహ్మాన్, మోరె నగేష్, గుర్రం వెంకట్‌రెడ్డి, దోమల అయిలు కొమురయ్య, తౌటిరెడ్డి జైపాల్‌రెడ్డి, నిమ్మల సతీష్, బుర్ర భాస్కర్, గంగసాని మహేందర్‌రెడ్డి, జమ్ముల ప్రణదీప్రెడ్డి, తదితర 13 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ధారావత్ దేవానాయక్, బజారు శ్యాంప్రసాద్, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.