Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలున్నాయా.. రుజువు చేయాలి
- మాజీ మంత్రి ఈటలకు మంత్రి ఎర్రబెల్లి సవాల్
నవతెలంగాణ-కమలాపూర్
మండలాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేస్తానని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం శనిగరం గ్రామంలో నిర్వహించిన టీఆర్ఎస్ మండల సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీలో చేరాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదోడికి డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించాలని చెబితే ఇక్కడి నియోజకవర్గంలో ఒక్క పేదవాడికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించలేదన్నారు. తన నియోజకవర్గంలో ప్రతి మండలానికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. బీజీపీ అధికారంలోకొ చ్చిన తర్వాత పెట్రోల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగాయని విమర్శించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో రైతులకు 24 గంటల ఉచిత్ విద్యుత్, రైతుబంధు, బీమా పథకాలను ఎక్కడన్నా అమలు చేస్తుందా... రుజువు చేయాలని సవాల్ విసిరారు. మాజీ మంత్రి ఈటల కొద్దిమంది పొగడ్తలకు పొంగిపోయి తన రాజకీయ జీవితాన్ని కోల్పోయారని అన్నారు. ఈటల ఆత్మ గౌరవం ఉంటే ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీలో ఎలా చేరారని ప్రశ్నించారు. ఈటల ఎన్ని సార్లు గెలిచిన కేసీఆర్ బొమ్మతోనే గెలిచారని అన్నారు. రైతుల సంక్షేమానికి ఉచిత కరెంట్, రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం ఇప్పటి వరకు అభివద్ధి చెందింది కేసీఆర్ నాయకత్వంలోనే అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జెడ్పీ చైర్మెన్ సుధీర్‌బాబు మాట్లాడుతూ నియోజకవర్గం మరింత అభివద్ధి చెందాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చల్లా ధర్మారెడ్డి సుధీర్‌బాబు తో కలిసి రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మెన్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రోడ్డు పనులకు శంకుస్థాపన
నడికూడ : మండలంలోని ధర్మారం గ్రామం నుండి పులిగిల్ల గ్రామం వరకు రూ.4 కోట్ల 97 లక్షలతో నూతనంగా తారురోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ రవీందర్రావు ఆధ్వర్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు, జెడ్పీ చైర్మెన్లు గండ్ర జ్యోతి, సుధీర్ బాబు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లెలు, పట్టణాలు అభివకృద్ధికి లక్షల కోట్ల నిధులు మంజూరు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకు పోతోం దన్నారు. నూతనంగా జిల్లాలు ఏర్పాటు చేసి వాటికి సరిపడా నిధులు మంజూరు చేస్తోందన్నారు. పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సీఎం కేసీఆర్ తో మాట్లాడ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుంచుతున్నారని అన్నారు. పరకాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారన్నారు. నూతన మండలం నడికూడ ఏర్పడడానికి కృషి చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలో నూతన గ్రామపంచాయతీ ఏర్పాటుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నిధుల నుండి రూ.25 లక్షలు, మంత్రివర్యులు ఎర్రబెల్లి నిధులు రూ.25 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. అనంతరం సర్పంచ్ రవీందర్ రావు ఎంపీటీసీ అప్ప చేరాలు, గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ ఏర్పాటుపై వ్యక్తం చేస్తూ వారిని సన్మానించారు. ఎంపీపీ, జెడ్పీటీసీ, ప్రజాప్రతి నిధులు, సర్పంచులు ఎంపీ టీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు.