Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
పల్లెలు పచ్చదనం, పరిశుభ్రతతో ఉండాలని, రానున్న వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ఈ నెల 15 నుంచి 22 వరకు ప్రత్యేక శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్లు, పంచాయతీ కార్య దర్శులు ముమ్మరంగా పనులు చేపట్టాలని, ఎప్పటికప్పుడు మండల స్థాయి పాలకులు, అధికారులు పర్యవేక్షణ చేయాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు. కాగా మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఐదు రోజులుగా ప్రత్యేక పారిశుధ్యం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కానీ, రుద్రారంలో మాత్రం పారిశుధ్యం పనులు చేపట్టలేదు. దీంతో తమ గ్రామానికి ప్రత్యేక శానిటేషన్ పారిశుధ్యం పనులు వర్తించవా అని ప్రశ్నిస్తూ గ్రామస్తులు ఆదివారం బస్టాప్ ఆవరణలో ధర్నా చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో రోడ్లపై మురుగు నీరు ప్రవహిస్తుందోని, డ్రైనేజీలు చెత్త చెదారంతో పేరుకుపోయి దుర్వాసన వేదజళ్ళుతోందని వాపోయారు. మూడు రోజులుగా ఆందోళనలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోక పోవడం దారుణమన్నారు. చిరు జల్లులకే రోడ్లు బురదమయమై కుంటలను, చెరువులను తలపి స్తున్నాయన్నారు. వృద్ధులు, పిల్లలు జారీ పడి గాయాలపాలైన ఘటనలున్నాయని అన్నారు. జీపీలో రూ.లక్షల్లో నిధులు మూలుగుతునాన గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆరోపిం చారు. 2,3,4వ వార్డులో సమస్యలు అధికంగా ఉన్నాయని తెలిపారు. కలెక్టర్ స్పందించి ప్రత్యేక పారిశుధ్యం పనులు చేపట్టాలని కోరారు.
రెండు రోజుల్లో పనులు పూర్తి : ఎంపీడీఓ నరసింహమూర్తి
గ్రామంలో డ్రైనేజీలు, రోడ్లు, బస్టాండ్ ఆవరణలో బురదమయమైన విష యం మా దృష్టికి వచ్చింది. పారిశుధ్యం పనులు చేపట్టాలని సర్పంచ్, కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశాం. పనులు నిర్వహించేందుకు స్థానిక పాలకవర్గం, అధికా రులు జేసీబీని తీసుకువచ్చి పనులు పారంభిస్తే గ్రామస్తులు పనులు అడ్డుకు న్నారు. పట్టా భూముల్లోంచి డ్రైనేజీలు, కాల్వలు తీయొద్దంటూ పనుల్ని అడ్డుకుం టున్నారు. అద్దెకు తెచ్చిన జేసిబి రెండు రోజులుగా ఖాళీగా ఉంది. గ్రామస్తులు ఐక్యంగా సహకరిస్తే రెండు రోజుల్లో పారిశుధ్యంలో పనులు పూర్తి చేస్తాం