Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హడావుడిగా రోడ్ల మరమ్మతులు
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు,
- సీపీ తరుణ్ జోషి
- భద్రతా ఏర్పాట్లలో పోలీసులు
నవతెలంగాణ-మట్టెవాడ
ఓరుగల్లు నగరానికి నేడు సీఎం కేసీఆర్ రానున్నారు. కాగా జిల్లా అధికారులు ఆదివారం హడావుడి చేశారు. ఇన్ని రోజులు రోడ్ల మరమ్మతులు పట్టించుకోని అధికారులు సీఎం నగర పర్యటన సందర్భంగా ఆయన పర్యటించే ములుగు రోడ్డు నుంచి ఆటోనగర్ 80 ఫీట్ రోడ్డులో ప్రధాన జంక్షన్లలో గుంతల మయంగా మారిన రహదారిని హుటాహుటిన తారు రోడ్డుతో తలతల మెరిసేలా చేశారు. దీంతో వాహనదారులు, ప్రజలు ఓరుగల్లుకు సీఎం ప్రతి నెలలో ఒక మారు వస్తే ఓరుగల్లు దశ మారి పోతుందేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఓరుగల్లును మెడికల్ హబ్ గా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల అంచనాతో సెంట్రల్ జైలు ప్రాంతంలో 24 అంతస్తులతో నిర్మించతలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భూమిపూజ తో పాటు కాలోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన నున్నారు. సంబంధిత ఏర్పాట్లను వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సీపీ తరుణ్ జోషితో కలిసి సమీక్షించారు. సీఎం పర్యటన ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లపై సీపీని అడిగి తెలు సుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించా లని, కేసీఆర్ పర్యటన విజయవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆటోనగర్ లోని వరంగల్ రీజినల్ నేత్ర వైద్యశాలకు ఎదురుగా ఐదెకరాల్లో రూ.20కోట్లతో 5 అంతస్తులతో అత్యా ధునిక హంగులతో నిర్మించిన కాలోజి నారాయ ణరావు హెల్త్ యూనివర్సిటీని నేడు ప్రారంభించ నున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ కూడా బందోబస్తుకు తీసుకుంటున్న జాగ్రత్తలను అధికారులను అడిగి తెలుసుకున్నారని కలెక్టర్ తెలిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ వెంకట లక్ష్మీ పర్య వేక్షణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భూమి పూజ వద్ద ఇద్దరు ఏసీబీలు, కాళోజి హెల్త్ యూనివర్సిటీ వద్ద వరంగల్ ఏసీపీ గిరీష్‌కుమార్ కలకోటతోపాటు ఘన్పూర్ ఏఎస్పీ, 10మంది సీఐలు, 20మంది ఎస్సైలు, 200మంది కానిస్టేబుళ్లతోపాటు క్యూ ఆర్ టి బెటాలియన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కాళోజి నారాయణరావు హెల్త్ యూని వర్సిటీ రిజిస్ట్రార్. డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మట్టేవాడ సీఐ గణేష్, తదితరులు పాల్గొన్నారు.