Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ ఉద్యమానికి స్పూర్తి దాత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 10 వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి భూపాలపల్లి జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షినిరాకేష్, వరంగల్ రూరల్ జెడ్పీి చైర్ పర్సన్ గండ్ర జ్యోతి తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉద్యమ చరిత్ర పుటల్లో మలిదశ ఉద్యమాన్ని నడిపి ఉద్యమ పంథాలోనే కాకుండా పార్ల మెంట్ విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవచ్చని నిరూపించిన మార్గదర్శకుడు జయశంకర్ సార్ అని ఆయన కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు.
పట్టణం వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందాలి
భూపాలపల్లి పట్టణం వ్యాపార వాణిజ్య రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకాంక్షించారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీసాయి మారుతి షాపును తన సతీమణి వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. భూపాలపల్లి అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ముందువరుసలో ఉందని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగు ణంగా ఇలాంటి వాణిజ్య వ్యాపారాలు రావాలన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రారంభించిన మారుతి జ్యువెలర్స్ షాప్ యజమానిని అభినందించారు. ఆయా కార్యాక్రమాల్లో
మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మండల లావణ్య విద్యాసాగర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, టీిఆర్‌ఎస్ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షులు సాంబమూర్తి, మండల రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు బుర్ర రమేష్‌గౌడ్, బండారి రవి, పైడిపెళ్లి రమేష్, టీజేఎఫ్ జిల్లా నాయకులు మాడ హరీష్‌రెడ్డి, హనుమాన్ టెంపుల్ చైర్మన్ గడ్డం కుమార్ రెడ్డి , స్థానిక కౌన్సిలర్ సిరుప అనిల్, ముంజంపల్లి మురళి, జక్కం రవికుమార్ ముంజల రవీందర్, రజిత మల్లేష్, చల్ల రేణుక పిల్లలమర్రి శారద నారాయణ, మాడ కమల పాల్గొన్నారు.