Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్
- జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీలో ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన జీవో 60 లో పేర్కొన్న జీతాల పెంపుదల పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని, జీవోను సవరించి వారి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. సోమవారం ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. 11వ పిఆర్సి కమిషన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించి కనీస వేతనాలు రూ.19వేలు, రూ.22900, రూ.31040 ఉండాలని సిఫారసు చేశారని అన్నారు. కానీ, అది ఇవ్వకుండా 30శాతం వేతనాలు పెంచడం వల్ల అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి కిరాయిలు, విద్య, వైద్య ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. ఇందుకనుగుణంగా వేతనాలు పెంచకుండా అన్యాయం చేసిందన్నారు. జీవో 60ని సవరించి పిఆర్సి కమిషన్ సిఫారసులను అమల్జేయాలన్నారు. పర్మినెంటు ఉద్యోగులతో పాటు జూన్ నుండి కొత్త వేతనాలు అమలు చేయా లని కోరారు. ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యో గులతో పాటు వైద్య, ఆరోగ్య, జూనియర్ పంచా యతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ, మోడల్ స్కూల్, కేంద్ర,రాష్ట్ర స్కీములో పని చేస్తున్న సిబ్బంది తో సహా వివిధ డిపార్ట్మెంట్లలో ,ఏజెన్సీ లు రిక్రూట్ చేసిన ఉద్యోగులందరిని ఈ జీవో పరిధిలోకి తేవాల న్నారు. కనీస వేతనం డీఏ,హెచ్ఆర్ఏ వర్తింప జేయాలని కోరారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పిఆర్సి జీవోలు కాకుండా కార్మిక శాఖ జీవోలు అమ లు చేయడం వల్ల జీతాలు తక్కు వగా ఉన్నా యన్నారు. అన్ని శాఖల్లో పీఆర్సీ జీవోలు పకడ్బం దీగా అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్ఎ విద్య శాఖ,రెవెన్యూ శాఖ తదితర సిబ్బందికి రెన్యువల్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల మొదటి వారంలో జీతాలు చెల్లించాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన పోరాటాలు నిర్వహి స్తామని హెచ్చరించారు. జాలి శ్రీనివాస్, ఎండీ రియాజ్, బి రాజు, ఆమ్జద్, శ్రీధర్, పాండురంగా రావు, విజరుకుమార్, ఆర్ సత్యనారాయణ, దినకార్ ,బొట్ల వెంకటరాజం, లక్ష్మీ, విజయ పాల్గొన్నారు.
జీఓ-60ని సవరించాలి
నర్సంపేట : కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జివో 60ని సవరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు అనంతగిరి రవి డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతూ అదనపు కలెక్టర్ హరిసింగ్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి ఆయన మాట్లా డారు. ప్రభుత్వం 2021 జూన్ 11న జారీ చేసిన పీఆర్సీ జివోలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతమే పేర్కొనడం అన్యాయ మాన్నారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2016లో జివో నెంబర్ 14 అమలు చేయడంలో ఐదేండ్లగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందన్నారు. కనీస వేతనాలు రూ.8వేల నుంచి 12వేల లోపు మాత్ర మేనని అత్యధిక మందికి ఇంతవరకే జీతాలు కేటా యించారన్నారు. ప్రస్తుతం 30 శాతం మాత్రమే పెంచడం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 9వ పీఆర్సీకి 10వ పీఆర్సీ నడుమ పెంపుదల 50 శాతం ఉండగా ప్రస్తుతం పెంచింది చాలా తక్కువ అన్నారు ప్రభుత్వం జివో 60ని వసవరించి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులకు కేటగిరిల వారిగా వేతనాలు పెంచాలన్నారు. ఫె˜డరేషన్ జిల్లా నాయ కులు మేడిపల్లి అరుణ, మంజుల, స్రవంతి, శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు గుజ్జుల ఉమా, వరలక్ష్మి, సునీత, గీత, సువర్ణ, యాకలక్షీ పాల్గొన్నారు.