Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వైద్య ఆరోగ్య శాఖలోనీ నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికి 11ద పీఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట తెలంగాణ మెడి కల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ యదానాయక్, ఎంఎచ్ఎం కో చైర్మెన్ రామ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయ కులు మాట్లాడుతూ.. వివిధ విభాగాల్లో పనిచేసే సెక్యూరిటీ, పేషెంట్ కేర్, నాలుగో తరగతి సిబ్బంది, ఆర్బీఎస్కే లోని డాక్టర్లు ఇతర సిబ్బంది లోని ఉద్యోగులు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎంలు యూ. పీఎచ్సి, సిఓ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్లు, ఎం.సీది .కౌన్సెల్స్ర్, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్ మెన్ , పీహెచ్సి కాంటీజెన్సి వర్కర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ లు, వైద్య ఆరోగ్యశాఖలోని ఇతర ఉద్యోగులందరికీ పీఆర్సీలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీన్ని వెంటనే సవరించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఏకుల చిరంజీవి, బైరి అశోక్, శ్రీనివాస్, వైకుంఠం అనిల్ కుమార్ నర్మదా, అరుణ, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ జిల్లా ప్రెసిడెంట్ జన్ను కొర్నాల్, చీఫ్ అడ్వైసర్ మోహన్‌రావు పాల్గొన్నారు.
రెగ్యులరైజ్ చేయాలని సీఎంకు వినతి
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల వేతనాలు పెంచుతు రెగ్యులరైజేషన్ చేసి 11 వ పీఆర్ సి ప్రకారం ఎన్ హెచ్ంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతు తెలంగాణ యునైటెడ్ హెల్త్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర నాయకులు యాద నాయక్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కోవిడ్ -19 పరిధిలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న వీరందరినీ పర్మినెంట్ చేయాలని అన్నారు. రాష్ట్రంలోని సుమారు 13 వేలకు పైగా ఉద్యోగులకు జీతాలు పెంచాలన్నారు. రక రకాల సర్వేలు , రికార్డుల నమోదు , ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ , వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాల వల్ల ఉదయం 8 నుండి రాత్రి 11గంటల వరకు పని ఒత్తిడికి గురువుతున్నారని అన్నారు. రాత్రులలో ఫోన్లు చేయడం, మెసేజ్ లు పెట్టడం వల్ల కుటుంబాలలో ఇబ్బందులు ఎదురౌతున్నాయని అన్నారు. ఏఎన్ ఎంలు, స్టాఫ్ నర్స్ లకు జాబ్ చార్ట్ ప్రకారంగా పని బాధ్యతలను అప్పగిస్తూ, టైమింగ్ పాటించే విధంగా చూడాలన్నారు. కరోనా మృతుల బాధిత కుటుం బాలను ఆదుకోవాలన్నారు. కేంద్రం ఇచ్చే ఎక్స్ గ్రేషియాతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలన్నారు. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కాగా ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.