Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జయశంకర్ భూపాలఫల్లి జిల్లా కేంద్రంలో గండ్ర సత్తన్న ఆదేశాల మేరకు సీనియర్ నాయకుడు బుర్ర కొమురయ్య,అంబాల శ్రీనివాస్, తోట సంతోష్ ఆధ్వర్యంలో ప్రభుత్వాల మొండి వైఖ రిని నిరసిస్తూ భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ పై పన్ను తగ్గించి జిఎస్టీ పరిధి లో చేర్చాలన్నారు. కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ సతన్నయువసేననాయకులు పిప్పాల రాజేందర్, నగునూరి రజినీకాంత్, రమేష్, విజరు, సురేష్, గోపీ, నాను, రాజేష్, కార్తీక్, క్రాంతి పాల్గొన్నారు.
శాయంపేట : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించి, నిరుపేదల పై ఆర్థిక భారం పడకుండా చూడాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేరళలో రాష్ట్రప్రభుత్వం పెట్రోల్ పై లీటర్‌కు 12 రూపాయల ధర తగ్గించిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే పరిస్థితిలో లేదని మండిపడ్డారు. ప్రభుత్వాలు వైద్యం పై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నయని, భూపాలపల్లి నియోజకవర్గం లో కరోనాతో 150 మంది మరణించగా, బ్లాక్ ఫంగస్ తో 15 మంది మత్యువాత పడ్డట్లు తెలిపారు. 25 వందల కోట్లను వ్యాక్సినేషన్ కోసం విడుదల చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించాడని, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కట్టలేదని అన్నారు. పొరుగు దేశాలలో రెండేళ్ల నుండి 18 ఏళ్ల వరకు వ్యాక్సినేషన్ పూర్తయి, మాస్కులు లేకుండా తిరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు డబ్బులు కట్టి ప్రతి ఒక్కరికి ఫస్ట్ సెకండ్ డోస్ లను ఇప్పించి, కరోనా వైరస్ ని ఎదుర్కొనే ఇమ్యూనిటీపవర్ పెంచాలన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆస్పత్రి ప్రారంభానికి నోచుకోలేదన్నార. హెచ్ఆర్ ఇవ్వలేదని, వైద్య పరికరాలు ఇవ్వలేదని, డాక్టర్లను నియమించలేదని మండిపడ్డారు. జిల్లా మంత్రి, ఎంపీ, భూపాలపల్లి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఆస్పత్రిని ప్రారంభించేలా చూడాల న్నారు. ఆరోగ్యశ్రీ లో కరోనా, బ్లాక్ ఫంగస్ చేర్చి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం చాలన్నారు. భూపాలపల్లి లో 116 ఎకరాల అటవీ భూమి ఉందని, పట్టాదారు హైకోర్టు నుండి జడ్జిమెంట్ తెచ్చుకున్నారని, అడవిని నరుకు తున్నారని మండిపడ్డారు. 1500 కోట్ల ఆస్తిని కాపాడడానికి హైకోర్టులో పిల్ వేసి మిషన్‌ను సీజ్ చేశామని, ఆ ప్రాంతంలో కోటి రూపాయలతో అటవీ శాఖ అధికారులు జూ పార్క్ డెవలప్మెంట్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అటవీ భూములను, ప్రజల ఆస్తులను కాపాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, చిందం రవి, నిమ్మల రమేష్, వైనాల కుమారస్వామి, కూకిడి నాగేశ్వరరావు, పాల్గొన్నారు.