Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస, టీజీఎస్, కేవీపీఎస్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-జనగామ
కులాల వారీగా ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం తగదని వ్యకాస, తెలం గాణ గిరిజన సంఘం, కేవీపీఎస్ నాయకులు విమర్శించారు. సదరు ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కులాల వారీగా ప్రజల నడుమ చిచ్చు పెట్టేలా ఉద్దేశపూర్వకంగా కులాల వారీగా ఉపాధి కూలీలకు వేతనాలు ఇవ్వాలని నిర్ణయించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే కుట్ర చేస్తోందన్నారు. సదరు నిర్ణయాన్ని విరమించుకోవాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేఏనిపక్షంలో ఉపాధి హామీ కూలీలను సమీకరించి అవగాహన కల్పించి చైతన్యవంతం చేసి భవిష్యత్లో పెద్దఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తోటి దేవదానం, వ్యకాస జిల్లా అధ్యక్షుడు రమేష్, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు లలిత, కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉపేందర్, ఉడుత రవి, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.