Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలి
- జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
దివ్యాంగులు వైకల్యంతో బాధపడకుండా సంకల్పంతో ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య కోరారు. జాకారంలోని డీఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఫిష్ పాండ్లో 5 వేల చేపపిల్లలను విడుదల చేశారు. అనంతర దివ్యాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ చేశారు. జిల్లాలోని 9 మండలాల దివ్యాంగులకు ఇన్నర్ వీల్ క్లబ్ అధినేత నేరెల్లి శోభ, ఇండియన్ క్రిస్టియన్ మినిస్ట్రీ అధినేత జేమ్స్ ముందుకొచ్చి 50 ట్రై సైకిల్స్ అందించినందుకు అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ఎస్ఎస్జీల వారీగా దివ్యాంగులను కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసి అర్హత మేరకు జీవనోపాధి కోసం రుణాల మంజూరుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పెన్షన్లపై నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డీఆర్డీఓ కార్యాలయ పక్కనున్న కుంటలో చేప పిల్లలను కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి బొమ్మె, బంగారు తీగ పరక పిల్లలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. మత్స్యకారుల ఆర్థిక పురోభివద్ధికి చేపల పెంపకం ఉపయోగ పడుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ నాగ పద్మజ, అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, డీపీఎం పద్మప్రియ, గోవిందు చౌహాన్, వేణుగోపాల్, విజయభారతి, లీలా కుమారి, తదితరులు పాల్గొన్నారు.