Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్ధిక బాధలను అర్దం చేసుకొని ఖరిప్ సమయం లో వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తెచ్చుకొని వడ్డీలు కట్టలేక అప్పుల బాధలు పడి ఆత్మహత్యలు,అప్పుల బాధలు పడుతున్నారని గ్రహించిన ప్రభుత్వం రైతులకు అండగా ప్రతి కరిప్ మరియు యాసింగ్ సీజన్ లో రైతు బందు అందించే క్రమం లో, నేడు బ్యాంకులు పాత బకాయిల పేరిట రైతు బందు డబ్బులను రైతులకు అందకుండా రైతుల ప్రమేయం లేకుండానే రైతుబంధు డబ్బులను కట్ చేసుకుంటున్నారని, దానితో రైతులకు పెట్టుబడి కి డబ్బులు అందే పరిస్థితి లేదని, ఆదివాసి హక్కుల పోరాట సమితి తూడుందెబ్బా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మై పతి,అరుణ్ కుమార్ అన్నారు. తాడ్వాయి మండల కేంద్రం లో ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా ఇంఛార్జి చర్ప.రవి అధ్యక్షతన జరిగిన సమావేశం లో అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యం నీ ప్రభుత్వ పరిధిలో ఉన్న బ్యాంక్ లు నీరు గారుస్తున్నయి అని అన్నారు. గతం లో రైతులకు అండగా ప్రభుత్వం కేటాయించిన క్రాప్ లోన్ లు, పంటలు సరిగా పండక రైతులు కట్టక పోవడం జరిగింది అని, దానిలో బాగంగా ప్రభుత్వం కూడా రుణ మాపి చేస్తాం అని ఇచిన హామీ నీ దష్టిలో పెట్టుకొని నేడు రైతులకు, రైతు బందు అందించాలని అన్నారు. ముఖ్యమంత్రి గారు జూన్ 15 న రైతు బందు అందిస్తాం అనగానే సంబర పడ్డ రైతులు బ్యాంకర్ల తీరుతో దిక్కు తోచని స్థితిలో కి వెళ్లారని అన్నారు, ప్రభుత్వం నుండి అన్నీ బ్యాంకులకు రైతు బందు నీ రైతులకు అందేలా నియమాలు జారీ చేయాలి అని అన్నారు లేదంటే రైతు బంధు విడుదల చేసిన అది రైతు కు అందే పరిస్థితి లేదు అని అన్నారు, రైతు బందు కనుక అందని క్రమం లో రైతులు మళ్లీ రోడ్డున పడతారని అన్నారు. కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ని బెల్లీ,గణేష్, జిల్లా అధ్యక్షుడు డబ్బాగట్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.