Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.25 లక్షలు వృథా
నవతెలంగాణ-మంగపేట
ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం, కాంట్రాక్టర్ల అలసత్వంతో ప్రజాధనం వృథా అవుతోందనడనికి ఇదో నిదర్శణం. మండలంలోని రమణక్కపేటలో ప్రభుత్వం రూ.25 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని 2018-19లో చేపట్టింది. కాంట్రాక్టర్ సంబంధిత శాఖ అధికారులతో కుమ్మక్కై నాసిరకంగా భవన నిర్మాణం చేయడంతో కనీసం మూడేండ్లు కూడా గడవక ముందే గోడలకు పగుళ్లొచ్చాయని గ్రామస్తులు తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించకపోవడం వల్లే పనుల్లో భారీగా అవినీతి చోటుచేసుకుందని, ఫలితంగా తక్కువ ఖర్చుతో నాసిరకంగా భవన నిర్మాణం చేపట్టి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని గ్రామస్తులు అంటున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి రమణక్కపేట గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని పరిశీలించి నాసిరకంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, అధికారుల అవినీతిపైనా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి : తోకల రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు
గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని నాసిరకంగా చేపట్టడంలో సహకరించిన ఇంజనీరింగ్, పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలి. మూడేండ్ల క్రితం నిర్మించిన పంచాయతీ భవనం నెర్రెలు పడి కురుస్తోంది. భవనంలో ఫర్నీచర్, కుర్చీలు లేక గ్రామస్తులు సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఇబ్బందిగా ఉంది. రూ.25 లక్షల ప్రజాధనాన్ని వృథా చేశారు. నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్ నుంచి నిధులు రికవరీ చేసి అతడికి సహకరించిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి.