Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి సీపీఐ(ఎం), సీపీఐ వినతి
నవతెలంగాణ-న్యూ శాయంపేట
వరంగల్, హనుమకొండ, కాజీపేటలతో కూడిన ట్రై సిటీగా శతాబ్ధాలుగా చారిత్రక నేపథ్యం కలిగి ఉందని, వరంగల్ మహా నగరాన్ని విభజించకుండా ఐక్యంగా ఒకే జిల్లా పరిధిలో ఉంచాలని, ఫలితంగా నగర అభివద్ధి కూడా సాధ్యమవుతుందని సీపీఐ(ఎం), సీపీఐ వరంగల్ అర్బన్ జిల్లా కమిటీలు బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందేలా వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎం), సీపీిఐ ప్రతి నిధి బందం సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు జి ప్రభా కర్రెడ్డి, ఎం చుక్కయ్య, ఉప్పలయ్య, జిల్లా కమిటీ సభ్యులు గొడుగు వెంకట్ , సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట బిక్షం, జిల్లా సమితి సభ్యులు పుట్టపాక రవి తదితరులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు జి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... గత సోమవారం ముఖ్యమంత్రి వరంగల్ అర్బన్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలను హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్లు మార్పు చేస్తు న్నట్లు ప్రకటించారని, మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు ఇస్తామని కూడా చెప్పారన్నారు.
వారి ప్రకటనలు విరుద్ధంగా మండలాలను కూడా మార్పులు చేస్తున్నట్లు పత్రికలలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోందన్నారు. కానీ వరంగల్ నగరాన్ని ఐక్యంగా ఉంచాలని గతంలో ముఖ్య మంత్రి ప్రకటించిన సందర్భంలోనే నగరంలోని రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అనేక ఉద్యమాలు చేసిన విషయం కేసీఆర్ కు తెలిసిందేనని అన్నారు. వారి అభిప్రాయాలను గౌరవించి వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లా లుగా ప్రకటించారని, నేడు మళ్లీ నగరాన్ని రెండుగా విభజిస్తామని ప్రకటించడం సరికాద న్నారు. వరంగల్ నగరాన్ని విభజించొద్దని కోరారు.