Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
మెగా నర్సరీలు ఏర్పాటు చేసేందుకు జిల్లాలో వివిధ మండ లాల్లో భూమిని గుర్తించడంలో తహసీల్ధార్లు నిబద్ధతతో పని చేయాలని ఇప్ప టికే గుర్తించిన భూమి సర్వే నెంబర్ నివేదికలు ఫోటోల ఆధారంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నా రు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాలపై మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తాసిల్ధార్లు, ఇజీఎస్ ఏపీఓలతో చర్చించి పలు సూచనలిచ్చారు. నర్సరీ పనులు వేగవంతం చేయాలని అన్నా రు. ఏడో విడత హరితహారంలో వివిధ రకాల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. పట్టణాలు, గ్రామాలను సుందరీకరణగా తీర్చిదిద్దాలన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ, సైడ్ డ్రైనేజీ కాలు వలు శుభ్రం చేయాలన్నారు. మురుగు నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. జిల్లాలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, సీజనల్ వ్యాధులు దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, సంబంధిత సిబ్బంది హాజరు నమోదును జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలుసుకుంటూ పీహెచ్సీ, సీహెచ్సీ లను సందర్శించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి జీతాల్లో కోత విధించి సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ ను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనని వైద్యాధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రాల పరిధి గ్రామాలను సందర్శిస్తూ సీజనల్ వ్యాధులు, పారిశుధ్యంపై ప్రజలను చైతన్య పరుస్తూ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మందులు అందజేయాలన్నారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలు ధరిచేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పీహెచ్సీ పరిధి కోవిడ్ పాజిటివ్ వివరాలను సర్పంచ్, వార్డ్ మెంబర్లకు అందించి అవగాహన కల్పించాలన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. ఏడో విడత హరితహారం ప్రగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో మూడు నెలల మెడికల్ క్యాంప్ నిర్వహణ విధివిధానాల షెడ్యూల్ తయారుచేసి అందించాలని ఆదేశించారు. శానిటేషన్తోపాటు మొక్కలు నాటడం, సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను రక్షించడం తదితర విషయాల్లో అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి జిల్లా ప్రగతికి బాటలు వేయాలని సూచించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డీఆర్డిఓ పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీ రామ్, జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి కె శామ్యూల్ పాల్గొన్నారు.