Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కరోనాతో నెల రోజులుగా పోరాడి మిషన్ భగీరథ కార్మికుడు భానోతు భద్రు(35) బుధవారం మృతి చెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజుపేట శివారు గార్లగడ్డ తండాకు చెందిన భానోతు భద్రు మిషన్ భగీరథ పథకం మంచినీటి సరఫరా ప్రాజెక్టులో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. నెల రోజుల క్రితం జ్వరం రావ డంతో నర్సంపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేసుకున్నాడు. వైద్యులు టైఫాయిడ్ అంటూ పలు రకాల మందులు ఇచ్చారు. వాటితో జ్వరం తగ్గలేదు .దగ్గు, జలుబు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వరంగల్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ నయం కాకపోగా మరో ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లా రు. మరో ఆస్పత్రిలో వెంటిలేటర్ పెట్టినా ఆర్యోగ పరిస్థితి చక్కబడలేదు. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని చేతిలెత్తేసి వైద్యులు 10 రోజుల క్రితం ఎంజీఎంకు రెఫర్ చేశారు. ఎంజీఎంలో భద్రుకు తగిన చిక్సిత చేశారు. చివరకు వెంటిలేటర్ పెట్టినా ఆరోగ్య పరిస్థితి విష మంగా మారి మృతి చెందాడు. ప్రయివేటు ఆస్పత్రుల్లో దాదాపు రూ.8లక్షలపైగా బిల్లుల పేరిట వసూల్ చేశారు. కాగా తన భర్త ప్రాణాలను కాపాడడానికి అప్పులు చేసి ఆస్పత్రుల్లో చెల్లించినా దక్కకుండా పోయాడాని మృతుడు భద్రు భార్య విజయ బోరున విలపించింది. భద్రుకు కూతురు, కుమారుడు ఉన్నారు. నిరుపేద భద్రు కుటుంబానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తండా వాసులు ప్రభుత్వాన్ని కోరారు.