Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేంద్రియ ఎరువులతో భూసారం పెరుగుతుంది
- వెదజల్లే పద్ధతిపై రైతుల దృష్టి పెట్టాలి
- మండల వ్యవసాయ అధికారి చాట్ల యాకయ్య
నవతెలంగాణ-సంగెం
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, పెట్టుబడిని తగ్గించుకునేందుకు నూతన యాజమాన్య పద్ధతిలో సాగు చే యాలని మండల వ్యవసాయ అధికారి చాట్ల యాకయ్య తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా ఆయన నవతె లంగాణతో మాట్లాడారు. పెట్టుబడులు తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయన్నారు. లోతుగా దుక్కులు దున్నడం వల్ల పంటకూడా చీడ పీడలు లేకుండా ఏపుగా పెరిగే అవకాశం ఉందన్నారు. మండలంలో 30వేల ఎకరాలు సాగు అవుతుందన్నారు. ఇందులో 18 వేల ఎకరాలు పత్తి, 6-7 వేల ఎకరాలు వరి, 1200 ఎకరాలు పసుపు, రెండు వేల ఎకరాల మొక్కజొన్న, 1800 ఎకరాల కందులు, 300ఎకరాల మిర్చి, పెసలు, నువ్వుల పంటలు కలిపి 180ఎకరాల్లో సాగు చేస్తున్నారని తెలిపారు. సేంద్రియ ఎరువులతో అధిక దిగు బడులు సాధించొచ్చని అన్నారు. వరి సాగు చేసే ముందు జీలుగ విత్తనాలను వేసి 45 రోజుల పూత దశలో దున్ని వరి నాట్లు వేస్తే అధిక దిగుబడి వస్తుందన్నారు. వరి పంట వెదజల్లే పద్ధతిని ప్రయోగాత్మకంగా మండలంలో 30 నుండి 50 ఎకరాలు సాగు చేయాలని రైతులను గుర్తించినట్టు తెలిపారు. తద్వారా ఎకరాకు రూ.6వేల నుంచి రూ.8వేల పెట్టుబడి తగ్గుతుందని అన్నారు.
రాయితీపై జీలుగ విత్తనాలు
మండలంలోని రైతులకు జీలుగా విత్తనాలు 50 శాతం రాయితీపై 370 క్వింటాళ్ల విత్తనాలను అందించామన్నారు. ఈ ఖరీఫ్‌లో మండలంలో సాగుచేస్తున్న పంటలకు కావాల్సిన ఎరువులను మూడు సొసైటీల ద్వారా, ఓడీసీఎంఎస్, ఆగ్రోస్, వివిధ పర్టిలైజర్ దుకాణాల ద్వారా రైతులకు సరఫరా చేయడానికి ముందు జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా లాట్ నంబర్ వేసి బిల్లుపై డీలర్ సంతకం తీసుకోవాలని కోరారు. చీడపీడల నివారణకు వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు చెప్పిన సలహాల మేరకే పురుగు మందులు పిచికారి చేయాలన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా రైతు వేదిక వద్ద ఉన్న ఏఈఓ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు.