Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
సీఎంఆర్ఎఫ్తో పేదలకు లబ్ది చేకూరుతుందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. మండలంలోని ఉగ్గంపల్లి గ్రామంలోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఉగ్గం పల్లి, మరిపెడ గ్రామాలకు చెందిన రాకేష్‌కుమార్, వీరన్న లకు బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆనారోగ్యం బారిన పడ్డ పేదలు ప్రయివేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటే ఆర్థికంగా చితికిపోతున్న క్రమంలో వారిని ఆదుకునేలా సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను విని యోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మరిపెడ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అయూబ్ పాషా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాంసింగ్, మల్లేష్ పాల్గొన్నారు.