Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల దుష్ప్రచారమేనా..?
- సమాచారం లేదు
- హరిభూషణ్ తండ్రి, సోదరులు
నవతెలంగాణ-వరంగల్/గూడూరు
సీపీఐ (మావోయిస్టు) పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ లక్మూ ఈనెల 21న గుండె నొప్పితో చనిపోయినట్లు పోలీసు అధికారులు ప్రకటిస్తుండగా, కుటుంబ సభ్యులు తమకెలాంటి సమాచారం లేదని, గతంలో కూడా చాలాసార్లు ఇలాగే ప్రచారం జరిగిందని చెబుతుండడంతో హరిభూషణ్ మృతిపై గందరగోళం నెలకొంది. ఈనెల 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మీనగుట్టలో కరోనాతో అస్వస్థతకకు గురై గుండెనొప్పితో మృతి చెందినట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, భధ్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అభినవ్ వల్లభ్ ప్రకటించిన విషయం విదితమే. హరిభూషణ్ మృతిపై రెండ్రోజులుగా అయోమయం, గందరగోళం నెలకొంది. మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.
పోలీసుల దుష్ప్రచారమేనా..?
నెల రోజులుగా ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు మావోయిస్టు పార్టీ నేతలకు కరోనా సోకిందని ప్రచారం చేయడం తెలిసిందే. అనంతరం జూన్ 2వ తేదీన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జి గడ్డం మధూకర్ ఎలియాస్ శోభ్రారుని వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి 12 మంది మావోయిస్టు అగ్రనేతలు కరోనాతో అస్వస్థతకు గురయ్యారని పేర్లు ప్రకటించారు. ఇందులో ఇద్దరు సెంట్రల్ కమిటీ సభ్యులు కాగా, మిగతా వారంతా రాష్ట్ర నేతలున్నారు. ఇందులో సిపిఐ (మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ ఎలియాస్ హరిభూషణ్