Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ-మహబూబాబాద్
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటేందుకు మొక్కలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని ముడుపుగల్, అయోధ్య గ్రామా లను బుధవారం ఆయన సందర్శించారు. నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించారు. అనంతరం ముడుపుగల్ ఎస్సీ కాలనీని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. ఫ్రైడే డ్రైడే, చెత్త సేకరణ, తదితరాల గురించి అడిగి తెలుసుకున్నారు. సెగ్రిగేషన్ షెడ్‌ను సందర్శించి చెత్త వేరు చేసే విధానాన్ని పరిశీలించారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే చెత్త సేకరణ చేపట్టాలన్నారలు. అయోధ్య గ్రామంలోని నర్సరీలో షిఫ్టింగ్, గ్రేడింగ్ పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఏడీఏ లక్ష్మీనారాయణ, ఎంపీవో హరిప్రసాద్, ముడుపుగల్, అయోధ్య సర్పంచ్‌లు యాస రమ వెంకట్‌రెడ్డి, కోలా సత్యం, ఎంపీటీసీ మిట్టకంటి రామిరెడ్డి, పంచాయతీ సెక్రెటరీ స్పందన, తదితరులు పాల్గొన్నారు.