Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా కేంద్రంలో చేపట్టిన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యా లయంలో ఆర్అండ్బీ అధికారుల తో సమీక్షా సమా వేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. పరిపాలన సౌలభ్యానికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, దానికి అనుగుణంగా అన్ని శాఖల అధికారులు ఒకే చోట ఉండేలా కార్యాలయాలు నిర్మించడానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. నాలుగేండ్లుగా భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, పనుల్లో వేగం పెంచి అందుబాటులోకి తేవాలన్నారు. రోడ్డు భవన నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. భూపాలపల్లి మండల ప్రెసిడెంట్ సాంబమూర్తి, మున్సిపల్ వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మెనర్ మేకల సంపత్ కుమార్‌యాదవ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాగర్ రెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పేదలకు అండగా ప్రభుత్వం
పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గణపురం మండలానికి చెందిన లబ్ధిదారులకు రూ.58,6728 విలువైన కళ్యాణలక్ష్మి ,షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. గణపురం సర్పంచ్ నారగాని దేవేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మైన్ పొరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి, సర్పంచుల పొట్ల నగేశ్, కుమరస్వామి, తాళ్లపల్లి మంజుల, ఎంపీటీసీ శివశంకర్‌గౌడ్, నాయకులు కర్ణాకర్ రెడ్డి, గంగాధర్ రావు, భాస్కర్‌రావు, నగేష్, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభం
గణపురం : రైతులకు నాణ్యమైన ఎరువులు. మందులు దొరికేందుకే ప్రభుత్వం జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎరువుల విక్రయకేంద్రాన్ని ఏర్పాటుచేసినట్టు ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామణారెడ్డి అన్నారు. బుదవారం మండలం లోని లక్ష్మారెడ్డిపల్లిలో ఎరువులకేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా జిల్లాలోని చివరి అయకట్టు వరకు పంట సాగు జరిగిందన్నారు. జిల్లా వ్యవసాయధికారి విజరు కుమార్, సొసైటీ చైర్మెన్ పోరెడ్డిపూర్ణచందర్ రెడ్డి సర్పంచ్ల ఫోరం మండల అద్యక్షుడు పోట్ల నగేష్ ఎంపీటీసీ సరస్వతి, ఏఓ ఐలయ్య, నాయకులు కర్ణాకర్‌రెడ్డి, దేవేందర్‌రావు, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.