Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
పంట రుణాల బకాయిలలో రైతుబంధు నిధిని జమ చేసి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ జూమ్ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే కరోనాతో రైతులు అనేక కష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా పెట్టుబడి సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. నాబార్డు ద్వారా రైతులకు అందించే సబ్సిడీ పథకాలకు బ్యాంకర్లు సహాకారాన్ని అందించి అమలు చేయడం బాధ్యత అన్నార. పెట్టుబడి సహాయాన్ని పంట రుణ బకాయికి లింకు పెట్టకుండా భేషరతుగా రైతుకు చెల్లించాలన్నారు. రైతుకు మరింత పెట్టుబడి కోసం బ్యాంకులు వానా కాలం పంట రుణ లక్ష్యాలను చేరు కోవాలన్నారు. మెడల్ అగ్రికల్చర్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రైతుల్లో అవగాహన పెంచడానికి దిగుబడి సాధించడానికి మార్కెటింగ్ స్కిల్స్ పెంచి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజర్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రైతులకు కావలసిన రుణంతో పాటు ప్రభుత్వం నుంచి రైతులకు సబ్సిడీ పథకాలు అమలు కోసం నాబార్డుతో పాటు అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. విత్తనోత్పత్తి, విత్తన శుద్ధీకరణకు నర్సంపేట, ఖానాపురం మండ లాల్లో ఎఫ్‌పీవోలకు వంద శాతం సబ్సిడీతో రూ.60లక్షల విలువజేసే యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. నిరుద్యోగుల కోసం బ్యాంకర్లు ఉచితంగా నిర్వహిస్తున్న ఆర్సీటీ ఇనిస్టిట్యూట్ సెంటర్‌ను నర్సంపేటలో ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తద్వారా ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. కమిటీ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ హరిత, లీడ్ బ్యాంక్ చైర్మన్ సత్యజిత్, కంట్రోలర్లు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యానికి సీఎంఆర్ఎఫ్
ఆపదలో ఉండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం మెరుగైన వైద్యం అందజేస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద నియోజకవర్గంలోని నల్లబెల్లి, నెక్కొండ, ఖానాపూర్, చెన్నరావుపేట మండలాలకు చెందిన 96మందికి రూ.32.63లక్షల విలువ జేసే చెక్కులను పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తించని అనేక రోగాలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద కార్పోరేటర్ ఆసుపత్రిలలో వైద్యం అందిస్తుందన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని లాక్డౌన్ ఎత్తేశారని ఇష్టానుసారంగా తిరగడం మానేయాలన్నారు. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం పరిశీలలో ఉందని, నష్టపోయిన ఆయా బాధిత కుటుంబాలు వైద్యం సంబంధిత ధృవీకరణ పత్రాలు భద్రపర్చు కోవాలని సూచించారు. టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నల్లబెల్లి ఎంపీపీ ఊడ్గుల సునిత ప్రవీణ్ గౌడ్, మాజీ ఎంపీపీ భానోతు సారంగపాణీ, నారక్కపేట సర్పంచ్ వక్కల మల్లక్క, ఎంపీటీసీ ఓదెల విజయలక్ష్మీ రవి, టీఆర్ఎస్ నాయకులు చంద్రమౌళి, ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, చెన్నారావుపేట మండల నాయకులు బాల్నె వెంకన్న, మాజీ జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, నెక్కొండ పీఏసీఎస్ చైర్మన్ రాము పాల్గొన్నారు.