Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలు చేసి విద్యార్థులను కరోనా బారి నుంచి కాపాడాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాల యంలో వినతి పత్రం అందజేసి ప్రశాంత్ మాట్లా డారు. కరోనా కారణంగా రెండేండ్లుగా విద్యా సంస్థలు మూతపడి విద్యార్థులు విద్యకు దూరమ య్యారన్నారు. అనేకమంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు బాల కార్మికులుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కిందటేడాది అనుమతి ఇచ్చిన ప్రభుత్వం కోవిడ్ నిబంధనల అమలు విస్మరించిందన్నారు. ఫలితంగా అనేక మంది విద్యార్థులు కరోనా బారిన పడాల్సి వచ్చిం దన్నారు. నిబంధనలను పాటించని పాఠశాలలు, గురుకులాల నిర్వాహులపై చర్యలు తీసుకోవా లన్నారు. తనిఖీలను ముమ్మరం చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అధికారులను, యం త్రాంగాన్ని అప్రమత్తంచేయాలన్నారు. జులై 1 ముందే పాఠశాలల్లో శానిటేషన్ చేసి విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేయాలన్నారు. పాఠశాలు, గురుకులాలలో ఆరోగ్య మిత్రలను ఏర్పాటు చేయాలన్నారు. వేగవంతంగా ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అందజేయాలని, ఖాళీ ఉపాధ్యాయ, సహాయకుల పోస్టులను భర్తీ చేయాలన్నార. అప్పటి దాకా అర్హత కలిగిన వారిని విద్యా వాలెంటర్లుగా నియామకాలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, గురుకులాలలో కోవిడ్ టెస్టులను చేయాలన్నారు. టాయిలెట్లు, మంచి నీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మధ్యాహ్నాం భోజనం నిధులను పెంచాలి, ఏజన్సీలకు బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జివో 46 అమలు చేసి అధిక ఫీజులు వసూళ్లను అరికట్టాలన్నారు. తల్లిదండ్రుల వద్ద వాయిదా పద్ధతులలో ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పించాలన్నారు. ప్రయివేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ కమిటీ నియమించాలన్నారు. ప్రయివేటు విద్యా సంస్థల్లో పాత ఫీజులకై వేధించకుండా భేషరత్గా టీసీలను అందజేస్తూ ప్రవేశాలకు అవకాశం కల్పించాలన్నారు. అద్దె భవనాల్లో వసతిగృహాల నుంచి వేరే ప్రభుత్వ భవనాలకు తరలించాలని, గురుకులాలు, కళాశాలలో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి వాక్సిన్ అందించాలని డిమాండ్ చేశారు.జిల్లా కమిటీ సభ్యులు యార రాకేష్, శివరాత్రి అనిల్, విజరు కాంత్, ప్రశాంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.