Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కమలాపూర్
ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ నియోజకవర్గ ప్రజలను డబ్బుతో కొనలేవని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం మండలంలోని శేఖర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల పాల్గొని మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో జరిగే ఉప ఎన్నిక ధర్మానికి అధర్మానికి యుద్ధమని నియోజకవర్గ ప్రజలు ధర్మానికి పట్టం కట్టే ప్రజలని అన్నారు. నాటి 2006 ఉపఎన్నికల్లో సర్పంచులు ఎంపీ టీసీలు లేకున్నా అధికారానికి వ్యతిరేకంగా ఉద్యమానికి బాసటగా నిలిచింది నియోజకవర్గ ప్రజలే అని గుర్తుచేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు ఓట్లు వేసే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని నియోజకవర్గంలో అభివృద్ధి చేయక తమ నియోజ కవర్గంలో అభివృద్ధి చేస్తానని చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతుబంధు పథకాన్ని నేను వ్యతిరేకించలేదని ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇవ్వాలని చెప్పానని అన్నారు. కానీ అధికార పార్టీ నాయకులు తనపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లాంటివాళ్ళు ఎంతమంది వచ్చినా తన ధర్మాన్ని ఓడించలేరని అన్నారు. రాబోయే ఉప ఎన్నిక రాష్ట్రంలో దిక్సూచిగా మారబోతు న్నదని అన్నారు. రాబోయే రోజులలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. నియంత పాలనకు చరమగీతం పాడేది ఈ నియోజకవర్గం నుండి ప్రారంభమ వుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం, మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి, ఎంపీపీ రాణి శ్రీకాంత్, నాయకులు, మాజీ ఎంపీపీ రమేష్, మాజీ జెడీపటీసీ సాంబరావు పాల్గొన్నారు.