Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మందిపై కేసు నమోదు
- అక్రమ వ్యాపారాలు చేస్తే పీడీ యాక్ట్ : ఎస్పీ
నవతెలంగాణ-కురవి
కురవి, మరిపెడ, కేసముద్రం మండలాల్లో రూ.10 లక్షల విలువైన 120 క్వింటాళ్ల నల్లబెల్లం, 5.5 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఎస్పీ యోగేష్ గౌతమ్, సీఐలు సాగర్, రవికుమార్ సూచనలతో కురవి, మరిపెడ, కేసముద్రం ఎస్సైలు రాణా ప్రతాప్, శ్రీనివాస్‌రెడ్డి, రమేష్‌బాబు సిబ్బందితో దాడి చేసి నిషేధిత నల్లబెల్లం, పట్టికను పట్టుకున్నట్లు తెలిపారు. 12 మంది నిందితుల్లో వేముల అజిత్‌రెడ్డి, పెండ్లి సాయికుమార్, బానోత్ రాకేష్, అంగోతు శివాజీ, భూక్యా భాస్కర్, గుగులోతు పూల్‌సింగ్, బాదావత్ శ్రీనివాస్, భూక్యా సురేష్లను అరెస్టు చేశామని, నలుగురు పరారీలో ఉన్నారని వివరించారు. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి నిషేధిత నల్లబెల్లం పట్టికను తీసుకొచ్చి కురవి, మరిపెడ, కేసముద్రం మండలాల ప్రాంతాల్లో గుడుంబా తయారీదారులకు విక్రయిస్తున్నారని చెప్పారు. నిషేధిత నల్లబెల్లం, పట్టిక, అంబర్, గుట్కా, తదితర అక్రమ వ్యాపారాలు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎస్సైలకు, సిబ్బంది జాకీర్, చంద్రారెడ్డి, అశోక్‌రెడ్డి, లక్ష్మణ్, రమేష్, యాకయ్యలకు ఎస్పీ రివార్డులు ఇచ్చి అభినందించారు.