Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లాలోని 8 మంది మానసిక దివ్యాంగ విద్యార్థులకు భారత ప్రభుత్వ సంస్థ (ఎన్ఐఈపీఐడి) ఆధ్వర్యంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్ పాపన సుమన్ సహకారంతో ఐఈ కోఆర్డినేటర్ గుల్లేపల్లి సాంబయ్య అధ్యక్షతన సంస్థ ప్రతినిధి అంజిరెడ్డి చేతుల మీదుగా బుధవారం దివ్యాంగ విద్యార్థులకు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల విలువైన బోధనోపకరణాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఐఈ కోఆర్డినేటర్ గుల్లేపల్లి సాంబయ్య మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులు విద్యలో వెనుకబడకుండా, అనేక కార్యక్రమాలను చేపడుతూ సాధారణ విద్యార్థులతో సమానంగా ముందుకెళ్లేలా సమగ్ర శిక్ష పనిచేస్తుందని అన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉపకరణాల పంపిణీ, బోధనోపకరణాల పంపిణీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఎస్కార్ట్ అలవెన్స్, ఇంటివద్దనే విద్యాబోధన, ఉపకార వేతనాలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థేరఫీ, భవిత స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల ద్వారా జిల్లాలోని అన్ని మండలాల విద్యార్థులకు సమగ్ర శిక్ష సేవలు అందిస్తుందని, ఈ సేవలను దివ్యాంగ విద్యార్థులు వినియోగించుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ చూపించి దివ్యాంగుల బంగారు భవితకు బాటలు వేసేలా కషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు పాపన సుమన్, ప్రత్యేక ఉపాధ్యాయులు సానికొమ్ము సుబ్బారెడ్డి, గొర్రె రమేష్, జాటోత్ రవి, గంగాధర్, రామ్మోహన్, రాజేంద్రప్రసాద్, టెక్నికల్ పర్సన్ అజ్మీర భరత్ పాల్గొన్నారు.