Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
తప్పుడు సర్వే చేస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) రాజనర్సయ్య, వెంకటాపూర్ సర్వేయర్లను సస్పెండ్ చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభికి బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), ఎంసీపీఐ, సీపీఐ నాయకులు తుమ్మల వెంకటరెడ్డి, గుండెబోయిన చంద్రయ్య, తోట మల్లికార్జున్‌రావు మాట్లాడారు. జమాన జమీందారుల కోసం వారి వారసుల పేరుతో వచ్చిన వారు 40 ఏండ్లుగా సాగులో ఉన్న భూములను ఆక్రమించడం కోసం సర్వే పేరుతోనే సర్వే డిపార్ట్మెంట్ డిఐ, వెంకటాపూర్ మండల సర్వేయర్ లు ప్రభావితం చేసి గతంలో ఉన్న సరిహద్దులను కాదని సరిహద్దులు మార్చిన మూలన పక్కకు ఉన్న నంబర్ లలోకి వస్తున్నందున ఆ రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తప్పు సర్వే చేస్తున్నా అధికారులను సస్పెండ్ చేయాలి అన్నారు. ఆ సర్వే ములానా ముప్పై కుటుంబాల రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు అసలు జమాన జమీందార్ల పట్టాల ను రద్దు చేసి సాగులో ఉన్న రైతులకు మాత్రమే అందించాలని దౌర్జన్యంగా వస్తున్నా జమీందారుల పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది 1860, 1865,1864 నంబర్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జమీందార్ల వారసుల పేరుతోని వస్తున్న చింతల చరణ్ వారి బందం కొంతమంది అధికారుల అండదండలతో దౌర్జన్యం చేస్తున్నారని వెంటనే పరిష్కరించని ఎడల దశాబ్దాలుగా సాగులో ఉన్న రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. తొలుత వెంకటాపూర్ మండల్ లింగాపూర్ శివారు లో కల భూముల విషయంలో పరిశీలించారు. సమావేశంలో సీపీఐ, సీపీఐ(ఎం) మండల కార్యదర్శులు, ఎండి అమ్జద్ పాషా, ముత్యాల రాజు, తదితరులు పాల్గొన్నారు.