Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
సీఎం సహాయనిధితో పేదలకు లబ్ది చేకూరుతుందని ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ తెలిపారు. మండలంఓని రామచంద్రపూర్, కాసిందేవిపేట, మదనపల్లె గ్రామాలకు చెందిన లబ్దిదారులకు టీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి, జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్, జెడ్పీటీసీ కుమారి సకినాల భవాని, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ మాట్లాడారు. పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందిస్తున్నారని తెలిపారు. సీఎం సహాయ నిధి చెక్కులు ద్వారా పేదలకు ఆర్థికంగా భరోసా కలుగుతుందని చెప్పారు. జెడ్పీటీసీ సకినాల భవాని మాట్లాడుతూ పేదలను ఆదుకునే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు రియాజ్ మీర్జా, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు పోరిక విజయరామ్నాయక్, రామచంద్రపూర్ సర్పంచ్ మట్కా కల్పనా రూప్సింగ్, ఓరుగంటి రాజమౌళి, లూధ్రెడ్డి, గుగులోత్ జీవుల, సోమ్లా, రాజిరెడ్డి, విజరుపాల్, రాజబాబు, మదనపల్లి ఎంపీటీసీ విజరు, సర్పంచ్ పోరిక రాంకుమార్, సీనియర్ నాయకులు కాండకట్ల సారయ్య, అమర్ సింగ్, లియాకత్ అలీ, గుండాల భాస్కర్, సలెందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.