Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యుడు బజారు శ్యాంప్రసాద్
నవతెలంగాణ-గోవిందరావుపేట
రాష్ట్రంలో రాజన్న రాజ్యం కోసం వైఎస్సాఆర్టీపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడు బజార్ శ్యాంప్రసాద్ కోరారు. మం డల కేంద్రంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం మండల అడహక్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన రావాల్సిన అవసరం ఉందన్నారు. పాలక ప్రభుత్వ అవినీతిని ప్రజలు ఎండగట్టాలని కోరారు. వైఎస్ఆర్ పాలనలో తరహాలో రైతులకు, నిరుద్యోగులకు, వ్యవసాయ కూలీలకు, చిరు వ్యాపారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అనంతరం మండల అడహక్ కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా మందాడి వీరారెడ్డిని, సభ్యులుగా రావుల సంపత్‌రెడ్డి, ధరావత్ కిరణ్, బొనగాని సారయ్య, రమేష్, మురారి కల్వకుంట్ల రాము, సురేష్, చల్లా ప్రసాద్, రణధీర్‌రెడ్డి, మంకిడి రవి, చెర్ప లక్ష్మీనారాయణ, వాసం కన్నయ్య, సునీత, మందాడి పుష్ప, రేణుక, పోరిక సారయ్య, బానోత్ మైనర్ బాబు ఎన్నికయ్యారు. సమావేశంలో నాయకులు ధరావత్ దేవానాయక్, రాజిరెడ్డి తధితరులు పాల్గొన్నారు.