Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
- మంత్రులు ఎర్రబెల్లి, ప్రశాంత్‌రెడ్డిలకు వినతి
నవతెలంగాణ-ములుగు
ములుగు నియోజకవర్గానికి గోదావరి జలాలను అందించాలని కోరుతూ ఎమ్మెల్యే సీతక్క, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్ హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును బుధవారం కలిసి లేఖను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని గోదావరి నదిని అనుకుని కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట మండలాలున్నాయని చెప్పారు. దేవాదుల తుపాకులగూడెం బ్యారేజీ, కంతానపెల్లి కూడా ఈ ప్రాంతంలో ఉన్నా ప్రజలకు సాగు భూములకు నీరులేక ఇబ్బందులు పడుతున్నారనీ తెలిపారు. తుపాకుల గూడెం బ్యారేజి నుండి కాల్వల ద్వారా కాన్నయి గూడెం ఏటూరు నాగారం మంగపేట తాడ్వాయి మండలాలకు సాగు నీరు అందించాలని లేఖలో పేర్కొన్నారు. అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి వెనుకబడ్డ నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు, పాత రోడ్లు, గ్రామాలను కలిపే లింక్‌లను అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీతక్క కోరారు.