Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణపల్లి పల్లె ప్రకతి వనం భేషుగ్గా ఉందని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలి పారు. మండలంలోని పార్వతమ్మగూడెం, బ్రాహ్మ ణకొత్తపల్లి గ్రామాలను బుధవారం ఆయన పర్యటి ంచి పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నర్సరీల, పల్లె ప్రకృతి వనం నిర్వహణలో అటవీ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలన్నారు. బ్రాహ్మణ కొత్తపల్లి నర్సరీలో పెంచుతున్న జామ మొక్కలను ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాలు, దేవాలయాల్లో నాటింప చేయాలని చెప్పారు. ఎదిగిన మొక్కలను ప్రస్తుత సంవత్సరం హరితహారానికి ఉపయోగించుకోవా లని చెప్పారు. అనంతరం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలోని పల్లె ప్రకతి వనం సందర్శిస్తూ వాకింగ్ ట్రాక్ చాలా బాగా చేశారనిసర్పంచ్ చింతకుంట్ల యాకన్న పాటు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ప్రశంసించారు. కలెక్టర్ వెంట ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, మండల ప్రత్యేక అధికారి బాలరాజు, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ సయ్యద్ రఫీ, ఎన్ఆర్ఐ సంతోష్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కష్ణవేణి, ఎంపీఓ పార్ధసారథి, ఈజీఎస్ ఈసీ హారిక, వీఆర్వో శ్రీలక్ష్మీ, రాజు, జేసీ భాస్కర్, పరిపాటి రుక్మిణి వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వరకల రాజు, ఉపసర్పంచ్ చిర్ర ఏకాంతం గౌడ్, వైస్ ఎంపీపీ జిల్ల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.