Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయని సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు బందు సాయిలు, కొరివి రాజకుమార్ విమర్శించారు. గురువారం వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భూపాలపల్లి కేంద్రంలో హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదుట పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్,డీజిల్పై లీటర్కు రూ.63 ఉండేదని, అధికారంలోకొచ్చిన నాటి నుంచి నిరంతరం ధరలు పెంచుతోందన్నారు. ఈ ఏదాది ఇప్పటివరకు దాదాపు 19 సార్లు ధరలు పెంచారన్నారు. పెట్రోల్, డీజిల్ ఆయిల్ ఫామ్ నుంచి రూ.32కు దేశానికి వస్తుందని, దీనిపై కేంద్రం దాదాపు రూ.32, రాష్ట్రం రూ.23 పన్ను రూపంలో వసూలు చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.100 దాటిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజలు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతుంటే బీజీపీ అవేమి పట్టించుకోకుండా ధరల భారం మోపుతోందని ఆరోపించారు. విదేశాల్లో పెట్రోల్, డీజిల్ లీటర్ను రూ.50 లోపే అందుబాటులో ఉంచుతున్నారని, మన దేశంలో మాత్రం అధిక ధరలతో నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వాపోయారు. పెట్రోల్ డీజిల్ పై పన్ను వసూళ్లను విరమించుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, కంపేటి రాజయ్య, సీహెచ్ రమేష్, గుర్రం దేవేందర్, పొలం రాజేంద్రర్, చక్రపాణి, సీపీఐ జిల్లా నాయకులు కుడుదుల వెంకటేష్, సొత్కు.ప్రవిన్, అమతయ్య చిలుముల నీలాల రమేష్ పాల్గొన్నారు.
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి : సోమ సత్యం
పాలకుర్తి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని, వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు సోమ సత్యం డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా అనిల్ చౌహాన్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 100కు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పెంచిన ధరలు తగ్గించకుంటే పోరాటాలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. మండల కార్యదర్శి చిట్యాల సోమన్న, మండల నాయకులు సోమ అశోక్ బాబు, మాసంపల్లి నాగయ్య, గిరిజన సంఘం నాయకులు భానోత్ అనిల్, బానోతు యాకుబ్, లావుడియా జీవన్ నాయక్ పాల్గొన్నారు.
ప్రజలను వంచించిన పాలకులు : సీపీఐ(ఎంఎల్) లిబరేషన్
సామాన్య ప్రజలను వంచించి పాలన కొనసాగిస్తున్నారని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా విమర్శించారు. గురువారం పాలకుర్తి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని, మును పెన్నడూ లేని రీతిలో ధరల పెరుగుదల ఉందని తెలిపారు. గ్యాస్ ధర వెయ్యి రూపాయలు పెరిగిందని, లీటర్ పెట్రోలు వంద రూపాయలు దాటిందని అన్నారు. ప్రభుత్వాలు పన్నుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నాయన్నారు. కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని, ఈ నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను దోచుకుంటూ కార్పొరేట్ సేవలో పాల కులు తరిస్తున్నారని మండిపడ్డారు. అన్ని రకాల ధరలు పెరు గుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల పట్ల బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు మాన్యపు బుజేందర్, సోమయ్య, అనంతోజు రజిత, దుస్స శివ ప్రసాద్, సారయ్య, కుమారస్వామి, రమేష్, పర్శరాములు, సోమయ్య పాల్గొన్నారు.