Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ వరమని, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 48మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజల అవస రాలు గుర్తించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజాభివృద్ధికి పాటుపడుతున్నట్టు తెలిపారు. అనా రోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొంది ఖర్చులపాలైన వారికి సీఎం సహాయనిధి ద్వారా లబ్ధి చేకూర్చు తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకా లను ప్రవేశ పెట్టిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగో లు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడమే కాకుండా రైతు బంధు మంజూరు చేసి ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారన్నారు. ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోదవీరారెడ్డి, జెడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మెన్ కుంభం క్రాంతి కుమార్‌రెడ్డి, ఇన్చార్జి సర్పంచ్ పూర్ణచంద్రరావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కామెడీ రత్నాకర్‌రెడ్డి, ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్, కో ఆప్షన్ మెంబర్ ఎండీ రాజమమ్మద్ పాల్గొన్నారు.