Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ధరలను పెంచి పేద, సామాన్యుల నడ్డివిరుస్తున్న బీజేపీ ప్రభుత్వాని గద్దె దింపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పెట్రోల్ బంక్ ఎదుట సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన సీపీఐ ఆధ్వర్యంలో డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచి భారాలను మోపిందన్నారు. ఫలితంగా వాహనాల రవాణా చార్జీలు విపరీతంగా పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుకున్నాయని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజల్లో కొనుగోలు చేయలేక పస్తులుండాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది పేదలు ఆకలితో అలమటిస్తుంటే మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారీ వర్గాలకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. అంబానీ, ఆదాని, రిలయన్స్, కంపెనీలకు కోట్ల రూపాయల సబ్సిడీని ఇస్తూ పేదలపై పన్ను భారం మోపుతుందని దుయ్యపట్టారు. ఇప్పటికైనా ధరలను నియంత్రించకుంటే రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, అనంతగిరి రవి, సీపీఐ జిల్లా కమిటీ అక్కపెళ్లి రమేష్, సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా నాయకులు మియాపురం గోవర్ధన్, పాల కవిత, ఇల్లందుల సాంబయ్య, గుజ్జుల ఉమా, నాగమణి, రజినీ, విజయ, కందికొండ రాజు, కార్తిక్, జెట్టి స్వర్ణలత, రాజు, విలియం కేరి, శివ, రమేష్,స్వామి వినోద, నర్సింహారాములు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
న్యూశాయంపేట : పేదవారి నడ్డి విరిచేలా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) వరంగల్ అర్బన్ జిల్లా నాయకులు వేల్పుల సారంగపాణి డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త పిలుపులో బాగంగా గురువారం హంటర్ రోడ్, న్యూ శాయంపేటలోని పెట్రోల్ బంక్ ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరవై సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని విమర్శించార. , ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ధరలు పెంచడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం కరోనా సందర్భంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక సాయం చేయకపోగా ధరలను అదుపు చేయడంలో విఫలం అయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పేదల అభివద్ధి కోసం కాకుండా సామ్రాజ్యావాదులకు, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నరని, ఇప్పటికైనా ఈ వైఖరి విడనాడాలని, వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు వేల్పుల సుధాకర్, వి. సతీష్, రవితేజ, కాకతీయ ఆల్ షాప్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాగనభొయిన బాబురావు, జనసేన పార్టీ నాయకులు గోపు నవీన్, అఖిల్, సంతోష్, ప్రణరు తదితరులు పాల్గొన్నారు.
వేలేరు : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం వేలేరు మండల కేంద్రుంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల బాధ్యులు వేల్పుల రవి, సీపీఐ బాద్యులు గడ్డమీది శంకరయ్యలు మాట్లాడారు. కరోనా కష్టకాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ నిత్యావసర సరుకుల ధరలు పెరగడంఓ ప్రజలపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
రాయపర్తి : దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మైలారం శివారు పెట్రోల్ బంకులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఎంసీపీఐ (యు) పార్టీ మండల నాయకుడు గుగులోత్ అరుణ్ నాయక్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడలన్నారు. లేకుంటే ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కయిత వెంకన్న, బుర్కా యాకయ్య, ఆరెల్లి ఎల్లయ్య, గుగులోతు వీరన్న, గుగులోతు వాసు, భూక్యా బాలరాజ్, సుధాకర్, దేవా, గుగులోతు బాలాజీ, భూక్య గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
దుగ్గొండి : రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎంసీపీఐ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) డివిజన్ సహాయ కార్యదర్శి ఎండి రాజా సాహెబ్, ఏఐఎఫ్‌డీవై జిల్లా కమిటీ సభ్యులు ఎల్ల బోయిన రాజు, పేరబోయిన ఐలోని, గటిక మొగిలి, సిరిబొమ్మల భాస్కర్, గోరంట్ల సాంబయ్య, బాబురావు, సంజీవ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మట్టెవాడ : పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి పెరిగిన ధరలను తగ్గించాలని ఎంసీపీఐ(యూ) వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి పనాస ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు పార్టీల పిలుపులో భాగంగా గురువారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జి హంటర్ రోడ్డు లో గల పెట్రోల్ పంపు ముందు ధరలను తగ్గించాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏం సిపిఐయు రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున, జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున్, కొత్తపల్లి చిరంజీవి, ప్రభాకర్ ,నరసయ్య, జగదీశ్వర్, గోరంట్ల శరత్ బాబు, నాగేష్, నర్రా కుమార్ యాదగిరి, రమేష్ పాల్గొన్నారు.
సంగెం : పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం తీగరాజుపల్లిలోని పెట్రోల్ బంకు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎండి ఇస్మాయిల్, నాయకుకలు చెవ్వ కుమారస్వామి, రామారావు, ప్రజాసంఘాల నాయకులు ప్రవీణ్, దేవేందర్ నాయక్, రమేష్ చింటూ, బాలు నాయక్, కిరణ్ పాల్గొన్నారు.
నడికూడ : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని దేశ వ్యాప్త పిలుపులో భాగంగా గురువారం పట్టణంలోని పెట్రోల్ బంక్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసనన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద శ్రీకాంత్, బొజ్జ హేమంత్, వంశీ, ఎస్ కళ్యాణ్, సిద్ధార్థ్, పున్నం, రామ్, కళ్యాణ్, నవీన్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట : పెంచిన ధరలను తగ్గించాలని గురువారం మండల కేంద్రంలో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) మండల నాయుకలు జన్ను రమేష్, సాంబయ్య, కళ, లచ్చమ్మ, చంద్రయ్య, అచ్చా నాయక్ తదితరులు పాల్గొన్నారు.