Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ గుండు సుధారాణి
నవతెలంగాణ- పోచమ్మమైదాన్
అభివద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సీఎంఏ, సాధారణ నిధులు, పట్టణ ప్రగతి, ఎస్సీ సబ్ ప్లాన్ పథకాల క్రింద జరుగుతున్న అభివద్ధి పనుల పురోగతిని డివిజన్ల వారిగా ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ కూలంకషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. హైద్రాబాద్ తరువాత రెండో అతిపెద్దదైనా వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్‌లు పలు పథకాల క్రింద కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. దీనితో పాటు ప్రతి నెల పట్టణ ప్రగతి పథకం క్రింద రూ 7.33 కోట్లు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.
జిడబ్ల్యూ ఎంసి పరిధిలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు, మురుగుకాలువలు, పార్కులు, కమ్మునిటీ హాల్ లు, ప్రహరిగొడల నిర్మాణానికి కొనసాగుతున్న పనులు సకాలంలో పూర్తి కావాలన్నారు. గుత్తేదారుల వెంటపడి త్వరితగతిన పూర్తి చేయించాలని అన్నారు. పనుల ప్రగతి ఆశాజనకంగా లేని గుత్తేదారులకు నోటీస్ లు జారీ చేయాలన్నారు. పూర్తయిన పనులకు జాప్యం జరుగకుండా వెంటనే బిల్లులు చేల్లింపులు జరిగేలా చర్యలు తీసుకొవాలన్నారు. ఈ సమీక్షలో ఈ ఈ లు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రావు, డి ఈ లు, ఏ ఈ లు, తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి..
రిస్క్ జోన్లో పనిచేసే సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవడం అత్యవసరమని బల్దియా మేయర్ గుండు సుధారాణి అన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), మునిసిపల్ కార్పొరేషన్, యు.ఎం.సి.సంయుక్త ఆధ్వర్యంలో కౌన్సిల్ హాల్ లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడారు. కరోనా కష్టకాలంలో సానిటేషన్ సిబ్బంది అందించిన సేవలు విస్మరించలేమన్నారు. వాక్సినేషన్ పై ఎలాంటి అపోహలు అవసరం లేదని, అందరూ నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి వాక్సినేషన్ అందించాలని, దశల వారిగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. యు.ఎం.సి.ఆధ్వర్యంలో స్వయం సహాయక బందాలకు వ్యాక్సిన్‌పై అవగాహనతో పాటు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పై అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించడం ముదావహమన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 1.20 లక్షల మంది సూపర్ స్ప్రేడర్స్ కు వాక్సినేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు.
నగరంలో సుమారు 1.60 లక్షల మంది స్వయం సహాయక బంద మహిళలకు 11 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 50 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్టు పేర్నొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీఎం ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించి కోవిడ్ బాధితుల్లో భరోసా నింపారన్నారు. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా 24 అంతస్తులతో సకల హంగులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ చేసినట్టు చెప్పారు. చారిత్రాత్మక వరంగల్ నగరంలో ఐ.టి, ఎడ్యుకేషన్ హబ్ తో పాటు హెల్త్ హబ్ గా తీర్చిదిద్డడం సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. నగర సమగ్రాభివద్ధికి పెద్ద పీఠ వేస్తున్న సీఎం కేసి ఆర్, పురపాలక శాఖ మంత్రి కెేటీఆర్లకు ఈ సందర్భంగా మేయర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యు.ఎం.సి.ప్రతినిధులు దశ్య శ్రవణ మాధ్యమం ద్వారా వాక్సినేషన్ ఆవశ్యకతను సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ సీహెచ్ నాగేశ్వర్, సి.ఎం.హెచ్.ఓ.డా.రాజారెడ్డి, మెప్మా ప్రాజెక్ట్ అధికారి విజయలక్ష్మి, సానిటరీ సూపర్ వైజర్ లు సాంబయ్య, భాస్కర్, నరేందర్‌లతో పాటు యు.ఎం.సి. ప్రతినిధులు వెంకట రమణ, మణిశంకర్, సానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు